స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం: ఆగస్టు 9-21 వరకు రవీంద్రభారతిలో కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…

Swathantra Bharatha Vajrotsavalu August 9-21 Daily Programs Schedule at Ravindra Bharathi, Bharata Swatantra Vajrotsava Dvisaptaham from August 9 to 21 at Ravindra Bharathi, Swathantra Bharatha Vajrotsavalu Daily Programs Schedule at Ravindra Bharathi, Swathantra Bharatha Vajrotsavalu Event at Ravindra Bharathi, August 9-21 Daily Programs Schedule at Ravindra Bharathi, Swathantra Bharatha Vajrotsavalu August 9-21, Bharata Swatantra Vajrotsava Dvisaptaham, 75 years of Indian Independence, Swatantra Bharata Vajrotsavam celebrations, Telangana Swatantra Bharata Vajrotsavam, Swatantra Bharata Vajrotsavam News, Swatantra Bharata Vajrotsavam Latest News, Swatantra Bharata Vajrotsavam Latest Updates, Swatantra Bharata Vajrotsavam Live Updates, Mango News, Mango News Telugu,

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల‌ మేర‌కు రవీంద్రభారతిలో ఆగస్టు 9వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించే రోజువారీ ప్రతిపాధిత కార్యక్రమాల షెడ్యూల్ ను ఉత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు గురువారం నాడు విడుదల చేశారు.

ఆగస్టు 9-21 వరకు రవీంద్రభారతిలో కార్యక్రమాల షెడ్యూల్:

  • ఆగస్టు 9 – జాతీయోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే “వందేమాతరం” నృత్య కార్యక్రమాలతో ప్రారంభోత్సవం – గురు కళాకృష్ణ బృందంచే
    75 మందితో పేరిణి నాట్య ప్రదర్శన
  • ఆగస్టు 10 – గాంధీజీ ఆశయ గీతాలతో వీణ కచేరి జయలక్ష్మి బృందం, ప్రమోద్ కుమార్ రెడ్డి బృందంచే నృత్యాలు
  • ఆగస్టు 11 – స్వాతంత్య్ర సమర స్ఫూర్తిని రేకెత్తించే నాట్య ప్రదర్శనలు, పిడమర్తి క్రాంతి బృందం, రాఘవరాజ్ మంగళ భట్ బృందం నృత్యాలు
  • ఆగస్టు 12 – విశ్వకవి రవీంద్రుని గీతాలలోని దేశభక్తి అంశాలతో “కావ్యాంజలి” నృత్య నీరాజనం, పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ బృందంచే
  • ఆగస్టు 13 – జాతీయ సమైక్యత గీతాలాపన “పాడవోయి భారతీయుడా”
  • ఆగస్టు 14 – ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతాల ఆలాపన, “తల్లి భారతి వందనం” ఆకాశవాణి కళాకారుల బృందం
  • ఆగస్టు 15 – భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే”సారే జహాసే అచ్చా-హిందూ సితా హమార” సంగీత నృత్య కార్యక్రమాలు, ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల ఉపాద్యాయులు, విద్యార్ధులచే
  • ఆగస్టు 16 – “స్వాతంత్య్ర స్ఫూర్తి వజ్రోత్సవ దీప్తి” అంశంపై క‌వి స‌మ్మెళ‌నం-సాహిత్యం అకాడమీ సార‌ధ్యం
  • ఆగస్టు 17 – భార‌త స్వాతంత్ర స‌మ‌రం భావ‌న‌ల‌తో పాట‌ల కార్యక్రమం, పుణ్యభూమి నా దేశం న‌మో న‌మామి, రామాచారి శిష్య బృందం
  • ఆగస్టు 18 మ‌రియు ఆగస్టు 19 – భార‌తీయ క‌ళా వైభ‌వం-భిన్నత్వంలో ఏక‌త్వం, దేశంలోని వివిధ నృత్య క‌ళ‌ల స‌మ‌హారం-తెలుగు విశ్వవిద్యాలయం వారిచే
  • ఆగస్టు 20 – భార‌త జాతీయోద్యమ ఘ‌ట్టాల‌పై నృత్య రూప‌కం వందేమాత‌రం, డా.కోట్ల‌ హ‌నుమంత‌రావు, డా.అనిత బృందంచే
  • ఆగస్టు 21 – సుశీల, ఎస్‌.పి. శైల‌జ సారధ్యంలో సినీ దేశ‌భ‌క్తి గీతాల ఆలాప‌న, భార‌త మాత‌కు జేజేలు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 10 =