దివంగత ఉమామహేశ్వరి నివాసానికి వెళ్లిన జూ. ఎన్టీఆర్.. కుటుంబ సభ్యులకు పరామర్శ

Jr NTR with His Wife Lakshmi Pranathi Visits Late Uma Maheswari Residence Today, Jr NTR Visits Late Uma Maheswari Residence with His Wife Lakshmi Pranathi Today, NTR Visits Late Uma Maheswari Residence with His Wife Lakshmi Pranathi Today, NTR's 4th Daughter Uma Maheswari Passes Away At Hyderabad Residence, SR NTR fourth daughter Kantamaneni Uma Maheswari has passes away, Senior NTR's fourth daughter Kantamaneni Uma Maheswari has passed away, NTR's Fourth Daughter Kanthamaneni Uma Maheswari Passes Away, Kanthamaneni Uma Maheswari Passes Away, SR NTR Daughter uma Maheshwari Passes Away, Senior NTR's youngest daughter Uma Maheshwari has breathed last today, Senior Ntr Daughter Uma Maheswari, Tragedy in Nandamuri family, Uma Maheswari youngest daughter of late actor Nandamuri Tarakara Rao, Uma Maheswari youngest daughter of late actor Senior NTR, late actor Nandamuri Tarakara Rao, Uma Maheswari Passes Away, Uma Maheswari Passed Away, Kantamaneni Uma Maheswari News, Kantamaneni Uma Maheswari Latest News, Kantamaneni Uma Maheswari Latest Updates, Kantamaneni Uma Maheswari Death Live Updates, Mango News, Mango News Telugu,

స్వర్గీయ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఈ అంతిమ సంస్కారాలకు ఆమె మేనల్లుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్నందున అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో.. గురువారం ఆయన హైదరాబాద్‌లోని దివంగత ఉమామహేశ్వరి నివాసాన్ని సందర్శించారు. కాగా ఎన్టీఆర్ వెంట ఆయన తల్లి షాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు. కళ్యాణ్ రామ్ మరియు జూ. ఎన్టీఆర్ ఇద్దరూ ఉమామహేశ్వరి సోదరుడు, దివంగత హరికృష్ణ కుమారులు అన్న సంగతి తెలిసిందే.

ఇక పోలీసు వర్గాల సమాచారం.. ప్రకారం ఉమామహేశ్వరి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోని బెడ్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయస్సు 57 సంవత్సరాలు కాగా, ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె కొంతకాలంగా మానసిక ఆందోళనతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో నిన్న జరిగిన ఆమె అంత్యక్రియలకు దగ్గరి బంధువు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్ రామ్ సహా మరికొందరు బంధువులు హాజరై నివాళులర్పించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here