పల్లె, పట్టణ ప్రగతిపై నివేదికలను బుక్ లెట్స్ గా రూపొందించాలి, సీఎస్ ఆదేశాలు

Haritha Haaram Program, Haritha Haaram Programs Starts, Mango News, Palle and Pattana Pragathi Programmes, Palle Pragathi, Palle Pragathi Programme, Palle Pragathi Programme Guidelines, Pattana Pragathi, Pattana Pragathi Guidelines, Pattana Pragathi Programme, Pattana Pragathi Programme Guidelines, pattana pragathi telangana, Telangana Palle Pattana Pragathi, Telangana Palle Pattana Pragathi Haritha Haaram Programs Starts From July 1st, Telangana Palle Pragathi Programme, Telangana Pattana Pragathi Programme

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో జూలై 1 నుండి నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని బుధవారం నాడు అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశంలో పల్లె,పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం అమలుపై సమగ్రంగా చర్చించారు. సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతిపై నివేదికలను బుక్ లెట్ లుగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఆచరిస్తున్న వినూత్న పద్దతుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమాల అమలుపై సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. జూన్ 26వ తేదీన ప్రగతి భవన్ లో నిర్వహించనున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో నివేదికపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సి.యంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, పిసిసిఎఫ్, శ్రీమతి శోభ, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, పిసిసిఎఫ్ (ఎస్ఎఫ్) ఆర్.యం.డోబ్రియల్, పిసిసిఎఫ్ లోకేశ్ జైస్వాల్, సి.యం ఓఎస్డి ప్రియాంకా వర్గీస్, సిడిఎంఏ సత్యనారాయణ, ఎస్పీసీఎల్, సిఎండి రఘుమారెడ్డి, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాస్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eighteen =