వైఎస్‌ఆర్‌కు హైదరాబాద్లో ఒక మెమోరియల్ కూడా లేకపోవడం బాధాకరం – వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల

YSRTP Chief Sharmila Responds Over Not Even Single Memorial in Hyderabad To Remember YSR, Sharmila Responds Over Not Even Single Memorial in Hyderabad To Remember YSR, YSRTP Chief Responds Over Not Even Single Memorial in Hyderabad To Remember YSR, Not Even Single Memorial in Hyderabad To Remember YSR, To Remember YSR, Not Even Single Memorial in Hyderabad, YSRTP Chief Sharmila, YS Sharmila, YSRCP Plenary-2022, 2022 YSRCP Plenary, YSRCP Plenary to be Held on July 8 9 at Guntur Leaders Monitoring Arrangements, YSRCP Plenary to be Held on July 8 And 9 at Guntur, YSRCP Plenary to be Held at Guntur, Guntur YSRCP Plenary, YSRCP Plenary, YSRCP plenary at Guntur, YSR Congress Party, YSRCP plenary at Guntur News, YSRCP plenary at Guntur Latest News, YSRCP plenary at Guntur Latest Updates, YSRCP plenary at Guntur Live Updates, Mango News, Mango News Telugu,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని స్మరించుకునేందుకు హైదరాబాద్‌లో ఒక్క స్మారకం కూడా లేకపోవడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ అధినేత్రి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లోటస్​పాండ్​లో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలతో పాటు వైఎస్సార్‌టీపీ ఆవిర్భావ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. గత ఏడాది జూలై 8న షర్మిల వైఎస్సార్‌టీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాల అనంతరం ఆమె ప్రెస్​మీట్​ నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి తెలుగు వారి గడపను, ప్రతి గుండెను తాకిందని పేర్కొన్నారు. ఆయన సేవలను ప్రజలు గుర్తించారని, కానీ ప్రభుత్వాలు మాత్రం గుర్తించలేకపోవడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్‌ను గుర్తు చేసుకునేలా ఒక్క స్మారకం కూడా నిర్మించలేదని, దీనికోసం హైదరాబాద్లో కనీసం ఒక్క సెంటు భూమి కూడా లేదా? అని షర్మిల ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య వైఎస్‌ఆర్‌ స్మారకం కోసం స్థలం కేటాయిస్తామని ప్రకటించారని, అయితే ఆ తర్వాత వచ్చిన పాలకులు దీనిపై దృష్టి సారించలేదని షర్మిల మండిపడ్డారు.

వైఎస్‌ఆర్‌ మరణానంతరం పాలించిన కాంగ్రెస్ కానీ, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వైఎస్ సేవలను విస్మరించాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ లాంటి గొప్ప నాయకులను ఒక పార్టీకో.. ఒక ప్రాంతానికో పరిమితం చేయరాదని ఆమె సూచించారు. పార్టీ పెట్టిన కొంతకాలం తర్వాత తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మరియు బాధితులకు అండగా ఉండటం కోసమంటూ 3500 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించారు. దీనిలో భాగంగా షర్మిల ఇప్పటివరకు 116 రోజుల్లో 1500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − two =