రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Notification Released For By Election Of Two MLC Seats, Two MLC Seats, Notification Released For MLC Seats, MLC Seats Notification Released, MLC Elections, Telangana, Elections Commission of India, Latest MLC Notification, MLC Notification News Update, MLC Elections, Polictical News, Telangana, Mango News, Mango News Telugu
MLC Elections, Telangana, Elections commission of india

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. మరో మూడు నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే లోక్ సభ స్థానాల వారీగా కేటీఆర్ తెలంగాణ భవన్‌లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఈసారి 17కు 17 స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అయితే లోక్ సభ ఎన్నికలకంటే ముందే తెలంగాణలో మరో ఎన్నికల కూడా జరగనుంది. తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి కడియం శ్రీహరి విజయం సాధించగా.. అటు హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి కూడా గెలుపొందారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఇద్దరూ తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాల పదవీకాలం 30 నవంబర్ 2027 వరకు ఉంది. ఈక్రమంలో ఆయా స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఈరోజు నుంచి ఈనెల 18 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 19న ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నారు. 22న ఉపసంహరణ ఉంటుంది.

ఇక ఈనెల 29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. ఆదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే అదే రోజు ఫలితాలు కూడా వెలవడనున్నాయి. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంటే.. బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. ఈక్రమంలో రెండు స్థానాలు కాంగ్రెస్‌కే దక్కుతాయా..? లేదా బీఆర్ఎస్‌కు ఒకటి.. కాంగ్రెస్‌కు ఒకటి దక్కుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + twelve =