హరితహారం, అగ్నిప్రమాదాల నివారణ, పది పరీక్షల నిర్వహణ సహా పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

CS Santhi Kumari held Video Conference with Collectors on Haritha Haram Blaze Mishaps Prevention Conduct of Tenth Exams,CS Santhi Kumari held Video Conference,CS Santhi Kumari with Collectors on Tenth Exams,Haritha Haram Blaze Mishaps Prevention,CS Santhi Kumari on Prevention Conduct of Tenth Exams,Mango News,Mango News Telugu,CS Santhi Kumari Latest News and Updates,Haritha Haram Blaze Mishaps Latest News,Tenth Exams 2023,Telangana Haritha Haram Blaze Mishaps Latest News,Telangana Tenth Exams Live News

వచ్చే తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖకు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఆదేశించారు. హరిత హారం, పల్లె ప్రగతి, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, వేసవిలో అగ్నిప్రమాదాల నివారణ, పదవతరగతి పరీక్షల నిర్వహణ, ఇళ్ల స్థలాల సేకరణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అనువైన స్థలాల్లో హరిత హారం క్రింద పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని, త్వరలోనే ప్రారంభం కానున్న 2023-24 హరిత హారంలో ఆయా జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఉన్న స్థలాలను గుర్తించాలని తెలిపారు. బృహత్ ప్రకృతి వనాలకు అవసరమైతే అటవీ భూములపై ప్రణాళిక తయారు చేయాలని, ఏప్రిల్ మాసాంతం వరకల్లా హరిత హారం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రస్తుత వేసవి కాలంలో ప్రజలు అగ్ని ప్రమాదాల బారినపడకుండా తగు ముందు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్లను కోరారు. అగ్నిప్రమాదాల నివారణ కేవలం అగ్నిమాపక శాఖపైనే వదలకుండా అన్ని ప్రభుత్వ విభాగాలను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రెండు అగ్నిప్రమాదాలు ప్రస్తావిస్తూ, అగ్నిప్రమాదాలు జరిగితే వెంటనే చేపట్టాల్సిన ముందు జాగ్రత చర్యలపై ప్రజలను చైతన్యపర్చాలని తెలియజేశారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశమున్న వాటిపై ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సీఎస్ కోరారు.

ఇక ఏప్రిల్ 4వ తేదీ నుండి 13 తేదీ వరకు జరుగనున్న పదవ తరగతి పరీక్షలకు 4.94 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఈ పరీక్షల నిర్వహణలో పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని సీఎస్ ఆదేశించారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు గతంలో మాదిరిగా 11 పేపర్లు కాకుండా ఈసారి కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 86.50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 14.23 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణి చేశామని చెప్పారు. 10.73 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల పంపిణి కొనసాగుతోందని అన్నారు.

అదేవిధంగా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రారంబించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. జిల్లాలోని కంటి వెలుగు, ఆరోగ్య మహిళ శిబిరాలను కలెక్టర్లు సందర్శించి ఉత్తమ సేవలందే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు నిరుపేదలకు లబ్ది కలిగే 58, 59,76,118 జీవోలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి పట్టాలపంపిణీ, క్రమబద్దీకరణకై నిర్దేశించిన మొత్తాలను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పేదలకు నివాస భూములులను పంపిణి చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల అనుసరించి, రాష్ట్రంలో 1039 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలను పంపాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఎస్సీ అభివృద్ధి శాఖ కమీషనర్ యోగితా రాణా, అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి, పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + sixteen =