తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు మేడారం జాతర పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారక్క దేవతలకు సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించనున్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలుసుకుని ఫిబ్రవరి 5 నుంచే ప్రారంభమయ్యే మేడారం జాతర రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ఏర్పాట్ల కోసం సీఎం కేసీఆర్ రూ.75 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మేడారంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మంత్రులకు, ఆప్రాంత ఎమ్మెల్యేలకు సూచించారు. భక్తులు లక్షల్లో తరలి రానున్న నేపథ్యంలో వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
[subscribe]