ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న జకోవిచ్

Australian Open 2020, Australian Open 2020 Mens Final, Djokovic seals 8th Australian Open, latest sports news 2020, Mango News Telugu, Novak Djokovic Beats Dominic Thiem, Novak Djokovic Wins 8th Australian Open Title

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ టైటిల్ ను టెన్నిస్‌ స్టార్‌ నోవాన్‌ జకోవిచ్‌ ఎనిమిదో సారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో రాఫెల్‌ నాదల్‌ను రెండో స్థానానికి నెట్టిన జకోవిచ్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను మళ్ళీ అందుకున్నాడు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్‌ పోరులో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్‌ థీమ్‌ను 6-4, 4-6, 2-6, 6-3, 6-4 తేడాతో ఓడించిన జకోవిచ్ మరో గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు. జకోవిచ్ ఇప్పటివరకు తన కెరీర్లో 17 గ్రాండ్‌స్లాములు సొంతం చేసుకుని మూడో స్థానంలో ఉన్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లాములు గెలిచినా మొదటి రెండు స్థానాల్లో ఫెదరర్ (20), రాఫెల్‌ నాదల్‌ (19) లు ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం జకోవిచ్, డొమినిక్‌ థీమ్‌ నాలుగు గంటలపాటు పోరాడారు. ఐదు సెట్ల పాటు సాగిన ఈ గేమ్‌లో మొదటి సెట్‌ను 6-4తో జకోవిచ్ గెలుచుకోగా, తదుపరి రెండు సెట్లును మాత్రం 4-6, 2-6 తేడాతో కోల్పోయాడు. అనంతరం నాలుగు, ఐదు సెట్లలో 6-3, 6-4తో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. గత మూడేళ్లుగా ఫైనల్ కి చేరిన ప్రతిసారీ జకోవిచ్‌ విజేతగా నిలిస్తూ వస్తుండడం విశేషం. 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020 సంవత్సరాలలో జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్ ను గెలుచుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here