రెండోరోజు ఘనంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు

Minister Talasani Srinivas Yadav Participates in Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations, Telangana Minister Talasani Srinivas Yadav Participates in Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations, Talasani Srinivas Yadav Participates in Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations, Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations, Sri Ujjaini Mahankali Bonalu Celebrations, Telangana Animal Husbandary Minister Talasani Srinivas Yadav, Animal Husbandary Minister Talasani Srinivas Yadav, Telangana Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav, Talasani Srinivas Yadav, Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations News, Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations Latest News, Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations Latest Updates, Secunderabad Sri Ujjaini Mahankali Bonalu Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండోరోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భాగంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. అనంతరం అంబారీపై అమ్మవారి ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. పోతురాజుల నృత్యాలు, మహిళల కోలాటం ప్రదర్శన, డప్పు చప్పుళ్ళతో అంబారీ ఊరేగింపుకు ముందు సాగారు. బోనాల ఉత్సవాలతో ఆలయ పరిసరాలు భక్తులతో ఎంతో కోలాహలంగా నిండిపోయాయి.

ముందుగా జూలై 17, ఆదివారం నాడు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బోనాల సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =