కేసీఆర్‌ను ఓడించడం కష్టమేమీ కాదు, సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Telangana Congress Chief Revanth Reddy Starts TPCC One Day Training Camp at Bowenpally Hyderabad Today,Telangana Congress Chief Revanth Reddy,TPCC One Day Training Camp,Bowenpally Hyderabad Today,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

కేసీఆర్‌ను ఓడించడం కష్టమేమీ కాదు, సమిష్టిగా పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఒక్కరోజు టీపీసీసీ శిక్షణ శిబిరాన్ని పార్టీ జెండాను ఆవిష్కరించిన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన నేతలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని, ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ అజేయుడేమీ కాదని, వచ్చే ఎన్నికల్లో పార్టీ నేతలందరూ సమిష్టిగా పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు.

అయితే ఓటర్ జాబితా నుంచి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని, నేతలు దీనిపై దృష్టి పెట్టాలని టీపీసీసీ చీఫ్ సూచించారు. నాటి యూపీఏ ప్రభుత్వం ద్వారా దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ అందించారని, తెలంగాణ సిద్దించడానికి కారకురాలు ఆమేనని రేవంత్ పేర్కొన్నారు. కాగా ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర’ చేస్తున్నారని, ఇది తనకోసం కాదని, దేశ భవిష్యత్ కోసమని కొనియాడారు. ఇక జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరదని, ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రతి గడపకు రాహుల్గాంధీ సందేశాన్ని చేరవేస్తామని, నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =