తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1986 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 30, గురువారం రాత్రి 9 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 62,703 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 21,380 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 586, మేడ్చల్ లో 207, రంగారెడ్డిలో 205, వరంగల్ అర్బన్‌లో 123, కరీంనగర్ లో 116, సంగారెడ్డిలో 108, మహబూబ్ నగర్ లో 61, కామారెడ్డిలో 46, మెదక్ లో 45, ఖమ్మంలో 41, మహబూబాబాద్ లో 37, నల్గొండలో 36, మంచిర్యాలలో 35, జోగులాంబ గద్వాల్ లో 32, నాగర్ కర్నూల్ లో 30, వరంగల్ రూరల్ లో 30, భద్రాద్రి కొత్తగూడెంలో 29, ములుగులో 27, పెద్దపల్లిలో 26, రాజన్న సిరిసిల్లలో 23, జనగామలో 21, సిద్ధిపేటలో 20, నిజామాబాద్ లో 19, వనపర్తిలో 18, ఆదిలాబాద్ లో 16, యాదాద్రి భువనగిరిలో 12, నిర్మల్ లో 9 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 30, రాత్రి 8 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు: 4,37,582
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 62,703
- కొత్తగా నమోదైన కేసులు : 1986
- నమోదైన మరణాలు : 14
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 45,388
- కరోనా రికవరీ రేటు: 72.3%
- యాక్టీవ్ కేసులు : 16,796
- హోమ్/ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య: 10,632
- మొత్తం మరణాల సంఖ్య : 519
- కరోనా మరణాల రేటు: 0.82%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu