రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు : సీఎస్ సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar Chaired State Level Narcotics Co-ordination Meeting, State Level Narcotics Co-ordination Meeting, CS Somesh Kumar Chaired State Level Narcotics Co-ordination Meeting, Somesh Kumar Chaired State Level Narcotics Co-ordination Meeting, Telangana CS Chaired State Level Narcotics Co-ordination Meeting, Narcotics Co-ordination Meeting, Stringent steps initiated to control drug peddling, Telangana chief secretary Somesh Kumar chaired the state-level Narcotics Co-ordination meeting at BRKR Bhavan, state-level Narcotics Co-ordination meeting at BRKR Bhavan, BRKR Bhavan, Telangana chief secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, Telangana chief secretary, state-level Narcotics Co-ordination meeting News, state-level Narcotics Co-ordination meeting Latest News, state-level Narcotics Co-ordination meeting Latest Updates, state-level Narcotics Co-ordination meeting Live Updates, Mango News, Mango News Telugu,

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోదించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని, అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం బీ.ఆర్.కే.ఆర్ భవన్లో సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్ రెడ్డి, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి రవీ గుప్తా, సిఐడి అదనపు డీజీ గోవింద్ సింగ్, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు జాయింట్ డైరెక్టర్ పి.అరవిందన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డైరెక్టర్ జెనరల్ డి.పి నాయుడు, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు దక్షణాది రాష్ట్రాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఐ.జి.రాజేష్ కుమార్, ఎక్సైజ్ శాఖ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు మార్లు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగును చేసే రైతులకు రైతు బంధు పధకాన్ని నిలిపివేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో నార్కోటిక్స్, ఇతర మత్తు పదార్థాల రవాణాను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను పోలీస్ శాఖకు అందచేయనున్నామని అన్నారు. పోలీస్ శాఖ, ఎక్సైజ్, ఆటవీ, గిరిజన సంక్షేమం, రెవిన్యూ శాఖలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై సమన్వయంతో పనిచేస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర సంస్థలైన నార్కోటిక్ కంట్రోల్ బోర్డు, డీఆర్ఐ తదితర సంస్థలతో కూడా కలసి నార్కోటిక్స్ కంట్రోల్ పై పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి మాదక ద్రవ్యాల వినియోగ నివారణ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా ప్రతీ జిల్లాలతో పాటు పోలీస్ కమీషనరేట్ లలో మాదక ద్రవ్యాల నిరోధక సెల్ లను ఏర్పాటు చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలియజేశారు. డ్రగ్స్ లను విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని, వీరిపై పీడీ చట్టాన్ని కూడా విధిస్తున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here