సరోగసి చట్టం అమలుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt Constitutes Special Board To Implement The Surrogacy Act of 2021, Special Board To Implement The Surrogacy Act of 2021, Surrogacy Act of 2021, Assisted Reproductive Technology Act-2021, Andhra Pradesh government has constituted a special board to implement the Surrogacy Act-2021, a special board to implement the Surrogacy Act-2021, Andhra Pradesh government, state and district authorities have also been established, state government has issued orders to this effect, Surrogacy Act, Surrogacy Act 2021 News, Surrogacy Act 2021 Latest News, Surrogacy Act 2021 Latest Updates, Surrogacy Act 2021 Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో సరోగసీ చట్టం-2021 మరియు అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్-2021లను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా అథారిటీలను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రాష్ట్ర, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం బోర్డుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీదేవి, బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధలను సభ్యులుగా నియమించింది.

ఇక రాష్ట్ర అథారిటీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌/డైరెక్టర్‌ చైర్మన్‌గా, అడిషనల్‌ డైరెక్టర్‌ (ఎంసీహెచ్‌) వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిల్లో అథారిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో వైస్‌ చైర్మన్‌గా ఉండనున్నారు. వీరితో పాటు ముగ్గురు సభ్యులు చొప్పున సభ్యులు ఈ అథారిటీలలో ఉంటారు. సరోగసీ, కృత్రిమ గర్భధారణ వంటి విధానాలతో కొనసాగుతున్న వ్యాపార ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఈ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కఠినంగా అమలు చేసేందుకు ఈ బోర్డులను ఏర్పాటు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =