టీఎస్ ఈసెట్-2021 ఫలితాలు విడుదల, ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలివే…

Mango News, Telangana ECET -2021, Telangana ECET-2021 Results Released, Telangana ECET-2021 Results Released Today, TS ECET, TS ECET 2021 Result, TS ECET 2021 Result Declared, TS ECET 2021 Results, TS ECET Result, TS ECET Result 2021, TS ECET Result 2021 declared on ecet.tsche.ac.in, TS ECET Result 2021 expected today, TS ECET result 2021 released, TS ECET Results 2021

తెలంగాణ రాష్ట్రంలో ఆగ‌స్టు 3న టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈసెట్-2021 ఫలితాలు బుధవారం నాడు విడుదల అయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ తుమ్మ‌ల పాపిరెడ్డి విడుద‌ల చేశారు. ఈసెట్‌ పరీక్షలో మొత్తం 95.16 శాతం మంది ఉత్తీర్ణులయినట్టు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులంతా అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.in లో ర్యాంక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం డిప్లొమా, బీఎస్సి మాథెమాటిక్స్ విద్యార్దులకు ఈసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈసెట్ ర్యాంకుల ఆధారంగా బీఈ /బీటెక్, బీఫార్మ‌సీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలోకి రెగ్యులర్‌ ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. మరోవైపు ఇప్పటికే ఈసెట్-2021 ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ ను కూడా ఉన్న‌త విద్యామండ‌లి ప్రకటించింది.

టీఎస్‌ ఈసెట్-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

మొదటి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – ఆగస్టు 24 నుంచి ఆగస్టు 28 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – ఆగస్టు 26 నుంచి ఆగస్టు 29 వరకు
  • సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు
  • సీట్లు కేటాయింపు – సెప్టెంబర్ 2
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 7 వరకు

తుది విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – సెప్టెంబర్ 13
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – సెప్టెంబర్ 14
  • సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 15 వరకు
  • తుది విడత సీట్లు కేటాయింపు – సెప్టెంబర్ 17
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 20 వరకు
  • విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలలో రిపోర్ట్ చేయడం : సెప్టెంబర్ 18 మరియు సెప్టెంబర్ 21 మధ్య
  • ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ మరియు బిఫార్మసీ కాలేజీలకు స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు ప్రకటన (https://tsecet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటు) : సెప్టెంబర్ 18

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =