తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఖరారు

TSPSC Announced Group-1 Mains Examination Schedule Starts From June 5,TSPSC Releases Group-2 Notification,TSPSC Group-2 Notification,TSPSC Notification,Mango News,Mango News Telugu,Group 2 Notification 2022 Telangana,Groups Notification 2022 Telangana,Group 4 Jobs Notification 2022 Telangana,Group 4 Jobs List In Telangana 2022 Notification,Group 4 Posts In Telangana 2022 Notification,Group 4 Notification 2022 Telangana Eligibility,Group 4 Notification 2022 Telangana Syllabus In Telugu,Group 4 Notification 2022 Telangana In Telugu,Telangana State Group 4 Notification 2022,Group 4 Notification 2022 Telangana Apply Online

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022, అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ మంగళవారం నాడు ఖరారు చేసింది. 2023, జూన్ 5, 6, 7, 8, 9, 10, 12వ తేదీల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆయా రోజుల్లో ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగనున్నట్టు తెలిపారు.

“గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 5 నుంచి 10 వరకు, మరియు జూన్ 12వ తేదీన హైదరాబాద్‌లో (హెఛ్ఎండీఏ పరిధితో సహా) రాత పరీక్షలు నిర్వహించబడతాయి. మెయిన్ పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నాం. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లీషు మినహా పేపర్లకు అభ్యర్థులు ఎంచుకున్నట్లు ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూలో సమాధానం ఇవ్వాలి. అయితే, ఒక అభ్యర్థి పేపర్‌లో కొంత భాగాన్ని ఇంగ్లీషులో మరియు కొంత భాగాన్ని తెలుగు లేదా ఉర్దూలో వ్రాయడానికి అనుమతించబడరు. ఇక జనరల్ ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ సంబంధించింది మరియు ఈ పేపర్ యొక్క ప్రమాణం సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఈ పేపర్‌లో వచ్చిన మార్కులు ర్యాంకింగ్ కోసం లెక్కించబడవు. అలాగే మెయిన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా రాత పరీక్షలోని అన్ని పేపర్లకు హాజరు కావాలి. ఏదైనా పేపర్‌ రాయడానికి హాజరు కాలేకపోతే అతని/ఆమె అభ్యర్థిత్వం అనర్హత కింద పరిగణించబడుతుంది” అని టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో తెలిపింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌:

  • జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫైయింగ్ టెస్ట్) – సమయం 3 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూన్‌ 5
  • పేపర్‌-1 జనరల్‌ ఎస్సే – సమయం 3 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూన్‌ 6
  • పేపర్‌-2 హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జాగ్రఫీ – సమయం 3 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూన్‌ 7
  • పేపర్‌-3 ఇండియన్‌ సొసైటీ, కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ – సమయం 3 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూన్‌ 8
  • పేపర్‌-4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్ – సమయం 3 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూన్‌ 9
  • పేపర్‌-5 సైన్స్‌ అండ్ టెక్నాలజీ అండ్‌ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ – సమయం 3 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూన్‌ 10
  • పేపర్‌-6 తెలంగాణ మూవ్ మెంట్ అండ్‌ స్టేట్ ఫార్మేషన్ – సమయం 3 గంటలు – మార్కులు 150 – పరీక్ష తేదీ జూన్‌ 12.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =