బీసీ రిజర్వేషన్స్ మరో 10 సంవత్సరాలు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

BC discussions expanded in Telangana, BC Reservations, BC reservations extended for 10 yrs, BC reservations extended in Telangana, Mango News, Telangana BC quota in education extended, Telangana government extended reservation for BC, Telangana Govt, Telangana Govt Extends BC Reservations, Telangana Govt Extends BC Reservations in Education, Telangana Govt Extends BC Reservations in Education Employment for Another 10 Years, Telangana Govt Extends BC Reservations in Education for Another 10 Years, Telangana Govt Extends BC Reservations in Employment

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు (బీసీ) చెందిన అన్ని కేటగిరీల రిజిర్వేషన్లు మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థల్లో మరియు ఉద్యోగ నియామకాల్లో బీసీలకు ఉన్న 29శాతం రిజర్వేషన్‌ ను జూన్‌ 1, 2021 నుంచి మే 31, 2031 వరకు పొడిగించారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఉద్యోగ నియామకాల్లో బీసీలకు ఉన్న ఐదేళ్ల వయో పరిమితిని కూడా మరో 10 సంవత్సరాలు కొనసాగించనున్నట్టు తెలిపారు. సచివాలయంలోని అన్ని డిపార్ట్మెంట్స్ మరియు హెడ్ ఆఫ్ డిపార్మెంట్స్ ఈ ఆదేశాలు అమలు అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ల గడువు మే 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీ కమిషన్‌ కార్యదర్శి సిఫార్సుల మేరకు ప్రభుత్వం మరో 10 సంత్సరాలు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ కులాల సంఖ్య 130 కు చేరుకుంది. కేటగిరీల వారీగా బీసీ-ఏ లకు 7 శాతం, బీసీ-బీ 10 శాతం, బీసీ-సీ 1 శాతం, బీసీ-డీ 7 శాతం, బీసీ-ఈ 4 కలిపి మొత్తం 29 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =