తెలంగాణలో రేపటి నుంచే ఇంట‌ర్ కాలేజీల‌కు ద‌స‌రా సెలవులు, అక్టోబర్ 10న పున‌:ప్రారంభం

Telangana Inter Board Announces Dussehra Holidays for Colleges from October 2 to 9th, Telangana Inter Board, Telangana Inter Board Announces Dussehra Holidays, TS Inter Board Announces Dussehra Holidays, Mango News, Mango News Telugu, Dussehra Holidays for Colleges, TS Inter Holidays from October 2 to 9th, TS Inter Board, Telangana State Intermediate Board, TS Intermediate Board, Telangana Inter Students Dussehra Holidays, Dussehra Holidays, Dussehra Celebrations, Dussehra Latest News And Live Updates

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్/జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా పండుగ సెలవులను ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 10, సోమవారం నుండి ఇంటర్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక బోర్డు ప్రకటించిన ద‌స‌రా సెల‌వు దినాల్లో నిబంధ‌న‌లు ఉల్లంఘించి విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తే, ఆయా కాలేజీల యాజ‌మాన్యాలు, ప్రిన్సిపాల్స్‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇంట‌ర్ బోర్డు హెచ్చ‌రించింది.

బోర్డు ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర యాజమాన్యాలు తమ విద్యార్థులకు దసరా సెలవులు అమలు చేయాలని కాలేజీలకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు తెలంగాణలోని పాఠశాలలకు అకడమిక్‌ క్యాలెండర్‌ 2022-23 ప్రకారం సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు 14 రోజులు పాటుగా దసరా పండుగ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − one =