తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఫీజు చెల్లింపు వివరాలివే…

Mango News, Telangana BIE notifies fee dates for inter exams 2022, Telangana Intermediate Board, Telangana Intermediate Board Announces Inter Public Exams, Telangana Intermediate Board Announces Inter Public Exams-2022, Telangana Intermediate Board Announces Inter Public Exams-2022 Fee Dates, Telangana Intermediate Board Exam Fee, Telangana Intermediate Board Exam Fee News, Telangana Intermediate Board Exam Fee Updates, TS Inter Exam Fee Dates 2022 for Intermediate, TS Inter Exam Fee Dates 2022 for Intermediate 1st year

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్,2022లో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, జనరల్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు ఏప్రిల్,2022 వార్షిక పరీక్షల కోసం జనవరి 5వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే గత అక్టోబర్ లో నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో పాసైన విద్యార్థులు తమ మార్కులు పెంచుకునేందుకు (ఇంప్రూవ్ మెంట్) ఏప్రిల్ లో ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కావొచ్చని చెప్పారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్‌ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపుల వివరాలు:

  • ఫీజు చెల్లింపు ప్రారంభమైన తేదీ : జనవరి 5
  • ఫీజు చెల్లింపు తుది గడువు : జనవరి 24 (ఆలస్య ఫీజు లేకుండా)
  • రూ.100 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: జనవరి 25 నుంచి జనవరి 31 వరకు
  • రూ.500 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు
  • రూ.1000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు
  • రూ.2000 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21 వరకు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 10 =