జార్ఖండ్ సంక్షోభం: సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటుకి అవకాశం, మొదలైన రిసార్ట్ రాజకీయాలు

Jharkhand Political Crisis JMM MLAs Likely to be Shifted to Chhattisgarh or West Bengal After Meeting with CM Soren, JMM MLAs Likely to be Shifted to West Bengal After Meeting with CM Soren, JMM MLAs Likely to be Shifted to Chhattisgarh After Meeting with CM Soren, JMM MLAs Meeting with CM Soren, Jharkhand CM Soren, Jharkhand Political Crisis, JMM MLAs Likely to be Shifted, Jharkhand CM Hemant Soren with UPA MLAs, CM Soren, Jharkhand Political Crisis News, Jharkhand Political Crisis Latest News And Updates, Jharkhand Political Crisis Live Updates, Mango News, Mango News Telugu,

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. జేఎంఎం అధినేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఏ క్షణంలోనైనా అనర్హత వేటు పడొచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవలి మహారాష్ట్ర సంఘటనల అనుభవంతో సొరెన్.. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తన ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించే అవకాశం లేకుండా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారంనాడు జేఎంఎం ఎమ్మెల్యేలు అందరినీ ఆయన తన నివాసానికి పిలిపించారు. చాలామంది ఎమ్మెల్యేలు బ్యాగ్‌లు, లగేజ్‌లతో పాటు సీఎం హేమంత్ సోరెన్‌ ఇంటికి చేరుకున్నారు.

రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలందరూ బస్సుల్లో బయలుదేరారు. కుంతి జిల్లాలోని అతిథి గృహానికి వారిని తరలించినట్లు సమాచారం. అక్కడినుంచి అధికార యూపీఏ ఎమ్మెల్యేలనంతా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు కానీ, మమతా నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ కు కానీ తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇక జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యా 81 కాగా, సీఎం సోరెన్‌ సారధ్యం లోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) 30 మంది ఎమ్మెల్యేలతో అది పెద్ద పార్టీగా ఉంది. అలాగే కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. యూపీఏ కూటమిగా ఈ మూడు పార్టీలు అధికారంలో ఉన్నాయి. మరోవైపు బీజేపీ 26 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష పార్టీగా ఉంది.

అయితే గనులశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం హేమంత్‌ సోరెన్‌.. స్టోన్‌ చిప్స్‌ మైనింగ్‌లో ఒక లీజును చేజిక్కించుకున్నారని, ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9(ఏ) ఉల్లంఘించినట్లేనని పేర్కొంటూ బీజేపీ నేత, మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌ ఈ నెల 18న గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై గవర్నర్ ఈసీఐ అభిప్రాయాన్ని కోరగా.. సోరెన్‌ను తొలగించవచ్చంటూ గవర్నర్‌కు సీల్ట్ కవర్‌లో ఈసీఐ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా గవర్నర్ అనర్హత వేటు వేస్తూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఇలా అధికారంలోని సంకీర్ణ పార్టీల ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. తాజా పరిణామాలపై సమీక్షించి తగిన వ్యూహరచన చేసేందుకు హేమంత్ సోరెన్ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =