పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది, ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విమర్శలు

Janasena Chief Pawan Kalyan Tweets over Plastic Flexies Ban and Industrial pollution in the State, Pawan Kalyan Statements On Plastic Flexies Ban, Pawan Kalyan Comments on AP Govt Policies, Mango News, Mango News Telugu, Janasena Chief Pawan Kalyan Criticisim on AP Government, Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Latest News And Live Updates, Janasena Chief Pawan Kalyan Tweets, Pawan Kalyan Twitter Live Updates, AP CM CM Jagan Bans Plastic Flex, Plastic Flexies Ban In AP, AP CM YS Jagan Mohan Reddy, YSR Congress Party

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం, విశాఖపట్నం పారిశ్రామిక కాలుష్యం నివారణ సంబంధిత అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం వరుస ట్వీట్స్ చేశారు. విశాఖపట్నం పారిశ్రామిక కాలుష్యం, విషవాయువు లీక్ మరియు మరణాలకు సంబంధించి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదని, దీనికి కారణమైన వారికి ఇప్పటి వరకు శిక్ష విధించబడలేదని అన్నారు. రుషికొండ‌ను ధ్వంసం చేస్తున్నారని, ఇప్పుడు ఒక్కసారిగా పర్యావరణంపై ప్రేమ?, ఈ ద్వంద్వ ప్రమాణం ఎందుకు? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

“రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి. అడవుల్లో సైతం పచ్చదనాన్ని నాశనం చేస్తూ అక్కడి సంపదను దోచేస్తూ పర్యావరణానికి హాని చేసే మైనింగ్ సంస్థల వివరాలను, అడ్డగోలుగా కొండలను తొలిచేస్తూ, పచ్చదనాన్ని హరించే ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దాం. మీమీ పరిధిలో ఉన్న కాలుష్యకారక ప్రాజెక్టులు, వాటి మూలంగా కలుగుతున్న హాని, మీ ఆరోగ్యాలకు ఎంత నష్టం కలుగుతుందో చెప్పండి. సదరు పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణను ఎంత ప్రహసనంగా మార్చి, ప్రభుత్వ బలగాలతో ఏ విధంగా ఆందోళనలను అణచి వేస్తున్నారో కూడా వెల్లడించే సమయం వచ్చింది. అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో? లేదో, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ మేరకు ఈ వివరాలను పొందుపరిచిందో? అయినా మన వంతు బాధ్యతగా అన్ని వివరాలూ బయటకు తీసుకువద్దాం. మన జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఈ కాలుష్య కారక పరిశ్రమలు, మైనింగ్ సంస్థలు వాటి మూలంగా కలుగుతున్న హానిని ప్రజా క్షేత్రంలో వెల్లడిద్దాం” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =