తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వ‌ల్ప మార్పులు

Telangana Night Curfew : Hyderabad Metro Rail Timings Changed,Telangana Government,Telangana,Telangana News,TS,TS News,Mango News,Night Curfew,Telangana Night Curfew,Coronavirus Live Updates,Night Curfew Imposed In Telangana,Night Curfew In Telangana,COVID-19 Live Updates,Telangana Lockdown News Live,Mango New Telugu,Hyderabad Metro,Hyderabad Metro Rail,Hyderabad Metro Rail Timings,Hyderabad Metro Rail Timings Changed,Hyderabad Metro Timings Changed,Latest News,Change In Hyderabad Metro Rail Timings Amid Night Curfew In Telangana,Hyderabad,Hyderabad Metro Latest News,Hyderabad Metro Timings Change,Hyderabad Metro New Timings,Hyderabad Metro New Time Table,Hyderabad Metro Rail New Timings

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటల నుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి మే 1వ తేదీ ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైలు స‌మ‌యాల్లో స్వ‌ల్ప మార్పులు చేయబడ్డాయి. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఒక ప్రకటన చేసింది. నగరంలోని టెర్మినల్ మెట్రో స్టేషన్స్ లో రాత్రి 7:45 గంట‌ల వ‌ర‌కే చివ‌రి మెట్రో రైలు అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఆ మెట్రో రైళ్లు రాత్రి 8:45 గంట‌లలోపు డెస్టినేషన్ కు చేరుకుంటాయన్నారు.

ఇక ప్రతిరోజు ఉదయం మాత్రం ఎప్పటిలాగానే 6:30 గంట‌ల నుంచి మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. మారిన సమయాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. మెట్రో ప్రయాణికులంతా మాస్కులు, శానిటైజ‌ర్లు సహా ఇతర అన్ని కరోనా నిబంధనలు పాటించి సిబ్బందికి సహకరించాలని హైదరాబాద్ మెట్రో అధికారులు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =