కొండగట్టు అటవీ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్, వెయ్యి ఎకరాల్లో ఔషద, సుగంధ మొక్కల పెంపకం: పీసీసీఎఫ్ డోబ్రియాల్

Telangana PccF RM Dobriyal Visited Kondagattu Forest Region Directed Officials on Development works,Telangana PccF RM Dobriyal, Visited Kondagattu Forest Region, Directed Officials on Development works, mango news,mango news telugu,Kondagattu Location,Kondagattu Distance,Kondagattu Hanuman,Kondagattu Jagtial,Kondagattu Nearest Railway Station,Kondagattu Official Website,Kondagattu Temple,Kondagattu Temple Wikipedia,Kondagattu Waterfalls,Kondagattu Which District,Kondapalli Reserve Forest,Kondagattu Forest Region Live Updates, Kondagattu Forest Region Latest News

జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి గుడి, పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ-పర్యావరణం, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాల మేరకు, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ సోమవారం కొండగట్టులో పర్యటించారు. ఆలయ అభివృద్ది, పునర్ నిర్మాణంపై సీఎం ప్రకటించిన తర్వాత రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన వంతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున కొండగట్టును ఆనుకుని ఉన్న కొడిమ్యాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో అటవీశాఖ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంయుక్తంగా ఈ కొడిమ్యాల అటవీ పునరుద్దరణ పనులు చేపట్టనున్నాయి.

కొండగట్టు ఆలయానికి అనుకునే విస్తారమైన కొడిమ్యాల అడవి ఉంది. పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఈ రోజు కొడిమ్యాలను సందర్శించి, అటవీ ప్రాంతం పునరుద్దరణ, అభివృద్ధికి తగిన ప్రణాళికలు, సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం కొండగట్టు పరిసర ప్రాంతాలలో గల రెండు అటవీ బ్లాకులలో చేయవల్సిన అభివృద్ధిపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముందుగా అటవీ ప్రాంతం చుట్టూ అవసరం అయిన చోట కంచె ఏర్పాటు చేయనున్నారు. సుమారు 5 కిలోమీటర్లు కాలినడక మార్గం (వాకింగ్ ట్రాక్) ఏర్పాటు చేయటం, వెయ్యి ఎకరాలలో ఔషద, సుగంధ మొక్కల పెంపకం, అందుకోసం అవసరమైన తగిన నర్సరీల ఏర్పాటు, వాచ్ టవర్ నిర్మాణం, భక్తులు సేద తీరేందుకు వీలుగా గజేబో నిర్మాణం తొలి దశలో చేపట్టనున్నారు. అలాగే ఆలయ పరిసరాల్లో విస్తారంగా తిరిగే కోతుల ఆహారం కోసం అటవీ ప్రాంతంలో పండ్ల మొక్కలను నాటనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ పర్యటనలో శరవణన్, ముఖ్య అటవీ సంరక్షణాధికారి, బాసర సర్కిల్, వెంకటేశ్వరావు, జగిత్యాల జిల్లా అటవీ అధికారి, లత, రేంజ్ ఆఫీసర్, మౌనిక, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, శ్రీ సాయిరాం, బీట్ ఆఫీసర్ పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =