తెలంగాణ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేనంతగా విద్యుత్ డిమాండు పెరిగింది. ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు ఉదయం 7.52 గంటలకు రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 13,168 మెగావాట్ల విద్యుత్ ను వినియోగించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మార్చి 23, 2014వ తేదీన 13,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ తో విద్యుత్ ను వినియోగించారు. ఇప్పటివరకు అదే రికార్డుగా కొనసాగుతుండగా ఈ రోజుతో ఆ రికార్డ్ చెరిగిపోయింది.
పెద్ద ఎత్తున విద్యుత్ డిమాండ్ ఏర్పడినప్పటికీ ఎక్కడా కోతలు, లోటు లేకుండా తెలంగాణలో విద్యుత్ సంస్థలు విద్యుత్ సరఫరా చేయడం విశేషం. ఇటీవల కాలంలో పలు విధాన నిర్ణయాల వలన తెలంగాణలో విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోతుంది. అలాగే దేశ వ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 1,181 మెగావాట్లు కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1,896 మెగావాట్లుగా కొనసాగుతుంది.
[subscribe]