హైదరాబాద్‌లో మరో ఇంటర్నేషనల్ రేసింగ్ ఈవెంట్.. ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-వరల్డ్ ఛాంపియన్‌షిప్

Telangana Special CS Arvind Kumar Launches Formula E-World Championship Tickets Which to be Held on Feb 11th in Hyderabad,Telangana Special CS Arvind Kumar,Formula E-World Championship,Formula E-World Championship Tickets,Mango News,Mango News Telugu,Formula E Race 12,Formula E Race Car,Formula E Race Distance,Formula E Race Highlights,Formula E Race Hyderabad,Formula E Race Hyderabad Tickets Price,Formula E Race Length,Formula E Race Results,Formula E Race Time,Formula E Racers,Formula E Standings,Formula E Teams,Next Formula E Race

ప్రపంచ స్థాయి నగరాల్లో నిర్వహించే ఫార్ములా రేసింగ్ ఈవెంట్స్ ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ఇండియన్ రేసింగ్ లీగ్‌ (ఐఆర్ఎల్)కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్‌, మరోసారి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ పోటీలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ఫార్ములా ‘ఈ-వరల్డ్ ఛాంపియన్‌షిప్’ ఈవెంట్ జరుగనుంది. ఫిబ్రవరి 11న జరగనున్న దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం 227 కిలోమీటర్ల మేర జరుగనున్న రేసింగ్ ట్రాక్‌కు ఎఫ్ఐఏ లైన్ క్లియర్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ-వరల్డ్ ఛాంపియన్‌షిప్ టిక్కెట్లను తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేసింగ్ కోసం ప్రేక్షకులు నేటినుంచి ‘బుక్ మై షో’లో టికెట్లను కొనుగోలు చేయొచ్చని సూచించారు. మొత్తం 22,500 టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కేటగిరీల వారీగా టికెట్ రేట్లు ఉంటాయని తెలిపారు. రూ. 1,000, రూ.3,500, రూ.6,000 మరియు రూ.10,000గా టికెట్ల రేట్లను నిర్ణయించారని వివరించారు. 2023 హైదరాబాద్ ఈ-ప్రిక్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించనున్నట్లు అరవింద్ కుమార్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =