ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఎస్జీటీలుగా ఉద్యోగావకాశాలు

2193 DSC-2008 candidates set to get SGT posts, Andhra Govt trying to conduct board exams, Andhra trying to conduct board exams, AP Board Exams 2021, AP Board Exams 2021 likely to be performed, DSC-2008 candidates to be appointed as SGTs, Mango News, Minister Adimulapu Suresh, Minister Adimulapu Suresh Said that DSC-2008 Candidates, Minister Adimulapu Suresh Said that DSC-2008 Candidates will be Appointed as SGTs

2014 ఎన్నికల సందర్భంగా సుదీర్ఘ పాదయాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం జరిగిందని, డీఎస్సీ-2008 కి సంబంధించిన కోర్టు కేసులను పరిష్కరించి 2193 మంది అభ్యర్ధులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. డీఎస్సీ-2008కి సంబంధించి పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల నియామకాలపై శుక్రవారం నాడు మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడ లోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మానవతా దృక్పధంతో డీఎస్సీ-2008 కు సంబంధించి 2193 మంది అభ్యర్ధులకు మినిమమ్ టైమ్ స్కేలుతో ఎస్జీటీలుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

డీఎస్సీ-2008 కి సంబంధించి నియామకాల క్రైటీరియా నిబంధనల మార్పు వలన సుమారు 4 వేలకు పైచిలుకు అభ్యర్థులు ఉద్యోగావకాశాలను కోల్పోవడం జరిగిందన్నారు. ఉద్యోగ అవకాశం కోల్పోయి కోర్టుల చుట్టూ ఈ అంశం నానుడికి గురి అయ్యిందన్నారు. 2014 ఎన్నికల హామీల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ 2008 డీఎస్సీ అభ్యర్థుల భవిత తేలుస్తామని చెప్పి, రాజకీయం చేసి ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. ఇది ప్రచారానికి పరిమితమై నిరుద్యోగులను మోసగింపచేసారన్నారు. అయితే సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టి ఈ సుదీర్ఘ సమస్య పరిష్కారానికి సుముఖం చేసారన్నారు. ఆర్థికశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా మినిమమ్ టైమ్ స్కేలులో ఎస్జీటీలుగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవకాశం కలిగిందని ఇందుకు సంబంధించిన దస్త్రంపై సీఎం సంతకం చేసిన అనంతరం జిఓను విడుదల చేయడం జరుగుతుందన్నారు. తదుపరి వీరికి ఆన్ లైన్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా వృత్తిపరమైన శిక్షణ అందించి నియామక ప్రక్రియను చేపడతామని ఆయన వెల్లడించారు.

టెన్, ఇంటర్ పరీక్షలకు సమయం అవసరం:

టెన్, ఇంటర్ పరీక్షలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ పరీక్షల ప్రక్రియకు సుమారు 40 రోజులు సమయం అవసరం ఉంటుందన్నారు. దీంతో పాటు విద్యార్ధులు నిట్, జెఇఇ, ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యేందుకు కూడా సమయం అవసరం అవుతుందని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఇప్పటిలో పరీక్షలు నిర్వహించే వీలులేదన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో తీసుకుని వాటిపై సంతృప్తి చెందిన పిదప తల్లిదండ్రులకు ఆందోళన లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలును ప్రకటిస్తామని మంత్రి వివరించారు. 2018 డీఎస్సీలో కూడా 6 వేల 361 పైచిలుకు అభ్యర్ధులను నియమించడం జరిగిందన్నారు. మరికొన్ని పోస్టులుపై కోర్టు కేసులు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించి మరో 486 పియుటి, స్కూల్ అసిస్టెంట్, తెలుగు పండిట్లకు పోస్టులకు సంబంధించిన నియామకాలను జరపబోతున్నామన్నారు. మరో 374 లాంగ్వేజ్ పండిట్ పోస్టులపై రిట్ పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయని త్వరలో అడ్వకేట్ జనరల్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఏపి టెట్-2021 పరీక్షల సిలబస్:

ఏపిటెట్-2021 పరీక్షలకు సంబంధించిన సిలబస్ ను తయారు చేసి http://aptet.apcfss.in/లో పొందుపరిచినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సమాచారం బ్రోచర్ ను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా సంచాలకులు వాడేవు చినవీరభద్రుడు, ఆర్‌జెడియస్. రవీంద్ర రెడి, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here