తెలంగాణలో లాసెట్‌-2022, పీజీఎల్ సెట్‌-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ ఖరారు

Telangana: TS LAWCET-2022 TS PGLCET-2022 Admissions Counselling Schedule Released, TS LAWCET-2022, TS PGLCET-2022 , Telangana LAWCET-2022 Counseling, Telangana LAWCET-2022 Counseling Schedule, Telangana LAWCET-2022, TS LAWCET-2022 Counseling, TS LAWCET-2022 Schedule, TS LAWCET-2022 Counseling Schedule, Mango News, Mango News Telugu, TS LAWCET-2022, TS LAWCET-2022 Results, TS LAWCET Counselling 2022 Dates Released, TS LAWCET Web Counselling Schedule, Telangana TS LAWCET Counselling 2022, TS LAWCET 2022 Latest News And Updates

తెలంగాణలోని లా కళాశాలల్లో 2022-2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్ఎల్బీ (3 సంవత్సరాల కోర్సు)/ఎల్ఎల్బీ 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు) ప్రవేశాల కోసం లాసెట్-2022, 2 సంవత్సరాల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఎల్ సెట్-2022ను జూలై 20, 21 తేదీల్లో నిర్వహించి, ఆగస్టులో ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీఎస్‌ లాసెట్‌-2022, టీఎస్ పీజీఎల్ సెట్‌-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఖరారైంది. నవంబర్ 2వ తేదీ నుంచి కౌన్సెలింగ్ పక్రియ ప్రారంభం కానున్నట్టు టీఎస్ లాసెట్/పీజీఎల్ సెట్‌ కన్వీనర్ తెలిపారు.

టీఎస్‌ లాసెట్‌-2022/టీఎస్ పీజీఎల్ సెట్‌-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ : నవంబర్ 1
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, ధృవీకరణ కోసం స్కాన్ చేసిన సర్టిఫికెట్ల కాపీలను అప్‌లోడ్ చేయడం: నవంబర్ 2 నుంచి నవంబర్ 12 వరకు
  • స్లాట్ బుకింగ్ ద్వారా ఎన్సీసీ/క్యాప్/దివ్యాంగ/స్పోర్ట్స్ కోటా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ : నవంబర్ 14 నుంచి నవంబర్ 16 వరకు
  • నమోదిత అభ్యర్థుల జాబితా ప్రదర్శన : నవంబర్ 17
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – మొదటివిడత : నవంబర్ 18 నుంచి నవంబర్ 19 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ సవరణ – మొదటివిడత : నవంబర్ 20
  • ఎంపికైన అభ్యర్థుల జాబితా కళాశాలల వారీగా సిద్ధం చేసి వెబ్ సైట్ లో ఉంచడం (మొదటి విడత సీట్లు కేటాయింపు): నవంబర్ 22
  • సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చలాన్ చెల్లింపు: నవంబర్ 23 నుంచి నవంబర్ 26 వరకు
  • తరగతులు ప్రారంభం : నవంబర్ 28.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eighteen =