1993 ముంబై పేలుళ్ల కేసు: కీలక నిందితుడు అబూ బకర్ సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్

1993 Mumbai Serial Blasts Case Gujarat ATS Arrests Abu Bakar and Three Others Accused Persons, Mumbai Serial Blasts Case Gujarat ATS Arrests Abu Bakar and Three Others Accused Persons, Gujarat ATS Arrests Abu Bakar and Three Others Accused Persons, 1993 Mumbai Serial Blasts Case, Mumbai Serial Blasts Case, Gujarat ATS Arrests Abu Bakar, Three Others Accused Persons, 1993 Bombay serial blasts case, Gujarat ATS arrests four accused, Gujarat Anti Terrorist Squad, Gujarat Anti Terrorist Squad Arrests Abu Bakar and Three Others Accused Persons, Abu Bakar Arrest, Gujarat Anti Terrorist Squad has arrested four persons wanted in the 1993 Mumbai serial blasts case, 1993 Mumbai Serial Blasts Case News, 1993 Mumbai Serial Blasts Case Latest News, 1993 Mumbai Serial Blasts Case Latest Updates, 1993 Mumbai Serial Blasts Case Live Updates, Mango News, Mango News Telugu,

1993వ సంవత్సరంలో ముంబై బాంబు పేలుళ్లలో నలుగురు నిందితులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. ముంబైలో వందలాది మంది మృతి చెందిన వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఎటిఎస్ మరింత మందిని పట్టుకుంది. భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడుల్లో ఒకటైన ముంబై పేలుళ్లపై ATS మరియు ఇతర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులపై కేసులు నమోదై శిక్షలు కూడా పడిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రధాన సూత్రధారుడైన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంను ఇంతవరకూ అరెస్ట్ చేయలేకపోవడం గమనార్హం.

ఈ మేరకు మంగళవారం విలేకరుల సమావేశంలో గుజరాత్ ఏటీఎస్ చీఫ్ మాట్లాడారు. ఆయన చెప్పినదాని ప్రకారం.. 1993 మార్చి 12న ముంబైలోని 12 వేర్వేరు ప్రాంతాల్లో 12 బాంబు పేలుళ్లు జరిగాయి. పేలుళ్లతో నగరం మొత్తం ఛిన్నాభిన్నమైంది. దాదాపు 300 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. ఇది భారత చరిత్రలో అత్యంత భయంకరమైన రోజులలో ఒకటి. 1993లో మహారాష్ట్ర పోలీసులు కేసును సీబీఐకి పంపారు. 190 మందితో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. NIA ఫిబ్రవరి 2022లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద దావూద్ ముఠాపై FIR నమోదు చేసింది. ఫిబ్రవరి 3 న నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, దావూద్ ఇబ్రహీం అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్-డి-కంపెనీని నడుపుతున్నాడని తెలిపారు.

అయితే, కొందరు నిందితులు భారత్ నుంచి మధ్యప్రాచ్య దేశాలకు పారిపోయారు. నకిలీ పాస్‌పోర్టులతో నలుగురు నిందితులు తిరుగుతున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు సమాచారం అందింది. లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత, ముంబై పేలుళ్ల కేసులో ప్రమేయం ఉన్నందున గుజరాత్ ఎటిఎస్ వారిని సర్దార్ నగర్ ప్రాంతం నుండి అరెస్టు చేసింది. కాగా అరెస్టయిన వ్యక్తులను అబూ బకర్, యూసుఫ్ భట్కా, షోయిబ్ ఖురేషీ (షోయిబ్ బాబా) మరియు సయ్యద్ ఖురేషీగా గుర్తించామని అధికారులు ప్రకటించారు. అరెస్టయిన వ్యక్తులు చాలా సంవత్సరాలుగా పరారీలో ఉన్నారని విచారణలో వెల్లడైంది. 1993 సీరియల్‌ పేలుళ్లలో ఇంటర్‌పోల్ వారిపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు (RCN) కూడా జారీ అయినట్లు విచారణలో వెల్లడైంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =