ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో నాకెలాంటి సంబంధం లేదు, దీనిపై ఏ విచారణకైనా సిద్ధం – ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kavitha Responds Over Allegations Against Her by BJP in Liquor Policy Case of Delhi, MLC Kavitha Responds Over Allegations Against Her by BJP in Liquor Policy Case of Delhi, Allegations Against Her by BJP in Liquor Policy Case of Delhi, TRS MLC Kavitha, Delhi Liquor Policy Case, Liquor Policy Case, BJP Liquor Policy Case, Delhi liquor scam, MLC Kavitha, Delhi Liquor Policy Case News, Delhi Liquor Policy Case Latest News And Updates, Delhi Liquor Policy Case Live Updates, Mango News, Mango News Telugu,

దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని, దీనిపై ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన తప్పుడు ఆరోపణలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో ఢిల్లీ రాష్ట్రంలో లిక్కర్ వ్యవహారంలో తానెందుకు జోక్యం చేసుకుంటానని కవిత ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలపై కక్ష పూరితంగా వ్యవహరించడం, బట్ట కాల్చి మీద వేయడం బీజేపీ నైజమని, ఇలాంటి చర్యలకు భయపడేది లేదని కవిత తెలిపారు. కేంద్రాన్ని ఎదిరిస్తున్న నేతలపై విచారణ సంస్థలను ప్రయోగించి వేధించడం మోదీ ప్రభుత్వానికి అలవాటేనన్న ఎమ్మెల్సీ కవిత, తాను ఏ తప్పు చేయలేదని, బీజేపీ వారికి కావాలంటే తనపై ఏ సంస్థతోనైనా విచారణ జరిపించుకోవచ్చని సూచించారు.

కాగా లిక్కర్‌ మాఫియాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రమేయం కూడా ఉందని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోని ఓబెరాయ్‌ హోటల్‌లో లిక్కర్ సెటిల్‌మెంట్లు జరిగాయని, దక్షిణాదికి చెందిన లిక్కర్‌ వ్యాపారులు.. రెడ్డి బ్రదర్స్‌, మాగుంట ఫ్యామిలీ తదితరులను కవిత స్వయంగా ఢిల్లీకి తీసుకువచ్చారని పర్వేశ్‌ ఆరోపించారు. అలాగే వీరి ద్వారానే ‘ఆప్’ పార్టీ నాయకులకు పంజాబ్‌, గోవా రాష్ట్రాల ఎన్నికలలో ధనసహాయం అందించారని తీవ్ర ఆరోపణ చేశారు. ఎవరికి లైసెన్స్‌లు ఇవ్వాలనే విషయంలో కవిత సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నారని, దీనిలో భాగంగానే పంజాబ్‌లో చద్దా ఫ్యామిలీకి చెందిన సీజ్డ్‌ లిక్కర్‌ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఆమె మధ్యవర్తిగా వ్యవహరించారని ఆయన తెలిపారు. తెలంగాణాలోని లిక్కర్ పాలసీని ఢిల్లీ, పంజాబ్‌, బెంగాల్‌లో అమలు చేసేలా కవిత ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలో పెద్ద ఎత్తున ముడుపులు ఆమెకు అందాయని పర్వేశ్‌ వర్మ ఆరోపించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here