నేడే ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, హాజరుకానున్న సీఎం కేసీఆర్

CM KCR will Attend Swatantra Bharata Vajrotsavalu Closing Ceremony Today at LB Stadium, Telangana CM KCR will Attend Swatantra Bharata Vajrotsavalu Closing Ceremony Today at LB Stadium, Swatantra Bharata Vajrotsavalu Closing Ceremony Today at LB Stadium, LB Stadium Swatantra Bharata Vajrotsavalu Closing Ceremony, Swatantra Bharata Vajrotsavalu Closing Ceremony, Independent India Diamond Festival closing ceremony, Azadi Ka Amrit Mahotsav Last Day Celebrations, Azadi Ka Amrit Mahotsav, Telangana CM KCR, Swatantra Bharat Vajraotsavalu, 75 years of Indian Independence, Azadi Ka Amrit Mahotsav News, Azadi Ka Amrit Mahotsav Latest News And Updates, Azadi Ka Amrit Mahotsav Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు నేడు (ఆగస్టు 22, సోమవారం) ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే ఈ ముగింపు ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. అలాగే ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు పాల్గొనేందుకు ప్రత్యేక వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మరో వేదికలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గత పదిహేను రోజులుగా చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ఆడియో-విజువల్ ప్రజెంటేషన్‌ను ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. అలాగే ఈ ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి లాంటి ప్రముఖుల సంగీత విభావరి, పద్మశ్రీ పద్మజ రెడ్డి బృందంచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సి బ్ర‌ద‌ర్స్ ఖ‌వాలి, తెలంగాణ జానపద కార్యక్రమాలు, లేజర్ షో, పెద్ద ఎత్తున క్రాకర్ ప్రదర్శన కూడా ఉండనున్నాయి. అదేవిధంగా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల వారసులను, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను సీఎం కేసీఆర్ సన్మానించనున్నారు.

ఈ వేడుకలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు, మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, డీసీసీబీ చైర్మన్లు, దేవస్థానం కమిటీ చైర్మన్లు, ప్రజలతో కలిపి దాదాపుగా 30 వేలమందికి పైగా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. మరోవైపు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల కోసం ఎల్బీ స్టేడియంలో చేసిన ఏర్పాట్లను సోమవారం ఉదయం ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు ఎంపీ కె.కేశవరావు, సీఎస్ సోమేష్ కుమార్, పలు శాఖల ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here