నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం..

KCR, MLA, KCR to Take Oath as MLA, KCR to Take Oath as MLA on February 1, Hyderabad News, Chief Minister, KCR, Telangana today, Telangana Bhavan, Former CM KCR, Revanth Reddy News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, Mango News Telugu, Mango News
Gajwel MLA, KCR took oath as MLA,CM, Ex CM, CM Revanth Reddy,Gajwel

మాజీ సీఎం..బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ రోజు  గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఇప్పటికే  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం అందింది.  స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయంలోప్రత్యేక పూజలు చేసి.. బీఆర్ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడిపోయారు. కేసీఆర్  తుంటి ఎముక విరిగిపోవడంతో  యశోద ఆసుపత్రిలో ఆయకను  చికిత్స చేసిన డాక్టర్లు.. కొంతకాలం విశ్రాంతి తీసుకోమని చెప్పడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మధ్యనే  కర్ర సహాయంతో కేసీఆర్ మెల్లిమెల్లిగా నడుస్తున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఎమ్మెల్యేగా  ప్రమాణస్వీకారం చేయడానికి కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత…  మూడు శాసనసభ ఎన్నికలు జరగగా అందులో ప్రతీ సారి   గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా  గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక అత్యధిక మెజార్టీతో గెలిచి రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టారు.  కానీ ఈ సారి మాత్రం కేవలం ఎమ్మెల్యేకే ఆయన పరిమితం అయి ప్రతిపక్ష నేతగా అధికారపక్షాన్ని ప్రశ్నించబోతున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసన సభ పక్ష కార్యాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి..  ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు.  ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరావడానికి సిద్ధం అవుతున్నారు. దీంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో..బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను యాక్టివేట్ చేయడానికి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 7 =