రేపటి నుంచే టీఎస్ ఎడ్ సెట్-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్, వివరాలివే…

TS Ed CET-2022 Admissions Counselling will Begin from October 18th, TS ED Cet-2022 Admissions Counseling, TS EdCET Web Counselling Schedule, TS EdCET Web Counselling Schedule 2022, Mango News, Mango News Telugu, TS EDCET, TS EDCET 2022, TS EDCET 2022 Counselling, TS EdCET 2022 Counselling Schedule, Ts Edcet Admission Counselling , TS EdCET 2022 Counselling Date, TS EdCET Counselling 2022, TS EDCET 2022 Counselling Process, TS EDCET Counselling Date 2022-2023, TS EDCET 2022, Ts Edcet Web Options 2022

రాష్ట్రంలో రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌-2022 మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌ రేపటి నుంచే (అక్టోబర్ 18, మంగళవారం) ప్రారంభం కానుంది. టీఎస్ ఎడ్ సెట్-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లో బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 18న ప్రారంభమవనుండగా, నవంబర్ 4న సీట్లు కేటాయింపు, నవంబర్ 14 నుంచి తరగతుల ప్రారంభం కానున్నట్టు షెడ్యూల్ లో పేర్కొన్నారు.

టీఎస్‌ ఎడ్‌సెట్‌-2022 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

మొదటి విడత:

  • నోటిఫికేషన్ జారీ : అక్టోబర్ 17
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, ధృవీకరణ కోసం స్కాన్ చేసిన సర్టిఫికెట్ల కాపీలను అప్‌లోడ్ చేయడం: అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 26 వరకు
  • స్లాట్ బుకింగ్ ద్వారా ఎన్సీసీ/క్యాప్/దివ్యాంగ/స్పోర్ట్స్ కోటా విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ : అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 28 వరకు
  • నమోదిత అభ్యర్థుల జాబితా ప్రదర్శన : అక్టోబర్ 28
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – మొదటివిడత : అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 30 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ సవరణ – మొదటివిడత : అక్టోబర్ 31
  • ఎంపికైన అభ్యర్థుల జాబితా కళాశాలల వారీగా సిద్ధం చేసి వెబ్ సైట్ లో ఉంచడం (మొదటి విడత సీట్లు కేటాయింపు): నవంబర్ 4
  • సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయడంతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చలాన్ చెల్లింపు: నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకు
  • తరగతులు ప్రారంభం : నవంబర్ 14.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − seven =