నేడే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ప్రారంభమైన పోలింగ్‌

Congress Presidential Election 2022 Voting Begins at AICC Office and to Take Place at Over 65 Booths Across the Country, Congress Presidential Election 2022, Voting Begins at AICC Office, Election Over 65 Booths Across the Country, Mango News, Mango News Telugu, Aicc President, TPCC's Key Decision, Aicc President Rahul Gandhi, Rahul Gandhi Aicc President, TPCC Congress President, TPCC Decision on Aicc President, All India Congress Committee , Indian National Congress, Sonia Gandhi, Mallikarjun Kharge , Shashi Tharoor

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష (ఏఐసీసీ ) పదవికి సోమవారం ఎన్నికకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో నేడు పోలిం‌గ్‌ జరుగనుంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఏఐసీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిలో 9,300 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) ప్రతినిధులు రహస్య బ్యాలెట్‌లో పార్టీ చీఫ్‌ని ఎన్నుకోనున్నారు. మొత్తం 65కి పైగా బూత్‌లలో పోలిం‌గ్‌ జరుగుతుండగా న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఓటు వేస్తున్నారు. కాగా రాహుల్ గాంధీ కర్ణాటకలోని సంగనకల్లులోని ‘భారత్ జోడో యాత్ర’ క్యాంప్‌సైట్‌లో సుమారు 40 మంది ప్రతినిధులతో కలిసి ఓటు వేయనున్నారు.

ఏఐసీసీ చీఫ్‌ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, శశిథరూర్‌లు సోమవారం ఎన్నికల పోటీలో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శశి థరూర్ తిరువనంతపురంలోని కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోనుండగా, మల్లికార్జున ఖర్గే బెంగళూరులోని కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు వేయనున్నారు. పోలింగ్ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 137 ఏళ్ల చరిత్రలో ఆరోసారి జరుగుతున్న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. కాగా ఈ ఎన్నిక ఫలి‌తాన్ని ఈ నెల 19న వెల్లడించ‌ను‌న్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =