తెలంగాణలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల.. అభ్యంతరాలకు 14 వరకు అవకాశం

TSLPRB Released SI and ASI Mains Exams Preliminary Key Today Available in www.tslprb.in Website,TSLPRB Released SI and ASI Mains Exams Preliminary Key,SI and ASI Mains Exams Preliminary Key Released Today,Available in www.tslprb.in Website,Mango News,Mango News Telugu,TSLPRB Released SI Preliminary Key,TSLPRB Released ASI Mains Exams Preliminary Key,SI Preliminary Key Available in www.tslprb.in Website,ASI Mains Exams Preliminary Key Available in www.tslprb.in Website,www.tslprb.in Website,TSLPRB latest News And Updates,SI And ASI Mains Exams Latest News And Updates

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ) మెయిన్స్‌ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ఈ మేరకు ప్రిలిమినరీ కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) గురువారం విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీ ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ www.tslprb.inలో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు దీనిని యాక్సెస్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, డౌన్‌లోడ్ లింక్‌ని ఉపయోగించి చెక్ చేసుకోవచ్చని సూచించింది. ఇక దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు బోర్డు దృష్టికి తీసుకురావచ్చని పేర్కొంది. అయితే సంబంధిత ఆధారాలను నిర్ణీత నమూనాలో మాత్రమే అప్‌లోడ్‌ చేయాలని, అలాంటి విజ్ఞప్తులనే పరిగణనలోకి తీసుకుంటామని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + six =