నేటి నుంచి వన్‌ టైం రిజి‌స్ర్టే‌షన్‌లో మార్పు‌లు, చేర్పులకు అవ‌కాశం – టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ కార్య‌దర్శి అనితా రామ‌చం‌ద్రన్‌

TSPSC Allows To Edit One Time Registration From Today in Telangana For Unemployed, TSPSC Allows To Edit One Time Registration From, Telangana State Public Service Commission, TSPSC Group 4 Recruitment 2022, TSPSC OTPR, Modification details in TSPSC OTPR From Today in Telangana For Unemployed, TSPSC Recruitment 2022, 2022 TSPSC Recruitment, Telangana State Public Service Commission Allows To Edit One Time Registration From, Telangana State, Public Service Commission, Unemployed In Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణాలో వన్‌ టైం రిజి‌స్ర్టే‌షన్‌ (ఓ‌టీ‌ఆ‌ర్‌)లో మార్పు‌లకు సోమ‌వారం నుండి అవ‌కాశం కల్పి‌స్తు‌న్నట్టు టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ కార్య‌దర్శి అనితా రామ‌చం‌ద్రన్‌ తెలి‌పారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ వెబ్‌‌సై‌ట్‌లో ఈ అవ‌కాశం అందు‌బా‌టులో ఉంటుం‌దని ఆమె తెలిపారు. రాష్ర్ట‌పతి ఇచ్చిన ఉత్త‌ర్వుల ప్రకారం.. 1వ తరగతి నుంచి 7వ త‌ర‌గతి వరకు చదువు కొనసాగిన ప్రాంతాన్ని బట్టి స్థాని‌కత గుర్తిస్తారు. అయితే తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడినందున, అభ్య‌ర్థుల స్థాని‌కత కూడా మారి‌పో‌యే అవకాశం ఉంది. ఈ మేరకు అభ్య‌ర్థులు 1 నుంచి 7వ తర‌గతి వరకు తెలంగాణలోని 33 జిల్లాల్లో ఏ జిల్లాలో చది‌వారో TSPSC వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే స్థాని‌కత ఆటో‌మె‌టి‌క్‌గా మారు‌తుంది. గతంలో దర‌ఖాస్తు చేసు‌కున్న వారు మార్పులు చేసు‌కో‌వ‌డంతో పాటు, కొత్తగా కూడా దర‌ఖాస్తు చేసు‌కోవచ్చని అనితా రామ‌చం‌ద్రన్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు TSPSC నుండి ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి TSPSC వెబ్‌సైట్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకునే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ఓటీఆర్ లో నమోదు చేసుకున్న అభ్యర్థులు TSPSC నుంచి వచ్చే అన్ని ప్రకటనలను నేరుగా అభ్యర్థి మొబైల్ ఫోన్‌కు SMS ద్వారా పొందే అవకాశం ఉంది. TSPSC నోటిఫికేషన్ ప్రకటన తర్వాత, ప్రతి ఒక్కరూ తమ సమాచారాన్ని OTRలో రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి లింక్ చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఓటీఆర్ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తోంది. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ కూడా TSPSC OTR రిజిస్ట్రేషన్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదని నిర్ధారించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − eleven =