చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న క‌రోనా.. లాక్‌డౌన్‌లో షాంఘై సిటీ

China is Shutting Down Shanghai City in Two Phases Amid Rising Covid-19, China is Shutting Down Shanghai City in Two Phases, China is Shutting Down Shanghai City, Shutting Down Shanghai City in Two Phases, China is Shutting Down Shanghai City Amid Rising Covid-19, new Covid-19 cases, new Covid-19 cases In China, China Covid-19 Updates, China Covid-19 Live Updates, China Covid-19 Latest Updates, Coronavirus, coronavirus China, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 41 Positive Cases, China Department of Health, China coronavirus, China coronavirus News, China coronavirus Live Updates, Mango News, Mango News Telugu,

చైనా యొక్క ఆర్థిక రాజధాని షాంఘై సిటీలో సోమవారం లాక్‌డౌన్‌ను విధించారు. ఫ్లై ఓవర్లు మరియు టన్నెల్స్ అన్నింటినీ మూసివేసారు. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చైనా యొక్క ఆగ్నేయ తీరంలో 26 మిలియన్ల జనాభా కలిగిన నగరమైన షాంఘై దేశంలో ఆర్థిక మరియు అంతర్జాతీయ వ్యాపారానికి కేంద్రంగా ఉంది. ఈ నగరం ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్-షిప్పింగ్ పోర్ట్‌కు నిలయం కావడం విశేషం. 2.6 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న షాంఘై నగరంలో లాక్‌డౌన్‌ను విధించడమంటే మాటలు కాదు.. అందుకే అక్కడ స్నాప్ లాక్‌డౌన్ పేరుతో తొలుత తొమ్మిది రోజుల పాటు రెండు-దశల లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు.

చారిత్రక హువాంగ్‌పు నది షాంఘై నగరాన్ని రెండుగా విభజిస్తుంది. హువాంగ్‌పూకు తూర్పున ఉన్న నివాసితులు తమ ఇళ్లకే పరిమితమై ఉండగా.. పశ్చిమాన ఉన్నవారు కిరాణా సామాగ్రి మరియు ఇతర నిత్యావసర వస్తువుల కోసం బయటకు అనుమతించబడ్డారు. తూర్పు ప్రాంతంలో సోమవారం నుండి శుక్రవారం ఉదయం వరకు లాక్‌డౌన్ విధించారు. అనంతరం శుక్రవారం ఉదయం నుండి తదుపరి మంగళవారం (ఏప్రిల్ 5) మధ్యాహ్నం వరకు పశ్చిమ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. షాంఘైలో పరీక్షలు నిర్వహిస్తున్న నిపుణులైన కోవిడ్ బృందం సభ్యుడు ‘వు ఫ్యాన్’ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో నగరవ్యాప్త లాక్‌డౌన్ చర్యలకు చైనా ప్రభుత్వం ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =