హైదరాబాద్‌లో ఐఆర్‌సీ సమ్మిట్‌ ప్రారంభించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ రెడ్డి

Union Minister Nitin Gadkari and CM Revanth Reddy Launches 85th Annual Session of IRC at Hyderabad

భారతదేశ రహదారుల నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్‌ స్థాయికి ఎదిగిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో గురువారం (నవంబర్ 19) ప్రారంభమైన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) వార్షిక సమావేశాన్ని నితిన్ గడ్కరీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. మౌలిక వసతుల అభివృద్ధికి ఆధునిక టెక్నాలజీ ఎంతో అవసరమని, మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసుకుంటూ ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ప్రపంచంలోని విజయవంతమైన రహదారి నిర్మాణ మోడళ్లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, రహదారుల అభివృద్ధిలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సమావేశంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

మరోవైపు, ఈ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏ ప్రాంతానికైనా సమగ్రాభివృద్ధికి మూలం మంచి రోడ్లేనని పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంతో హైదరాబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు తెలంగాణను మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు రహదారి కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నామని, రానున్న రెండేళ్లలో రూ. 93 వేల కోట్లతో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.

రహదారుల విస్తరణతో పాటు ప్రజారోగ్య రంగంలోనూ సమూల మార్పులు తీసుకువస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక ఆస్పత్రులను నిర్మిస్తున్నామని తెలిపారు. నాలుగు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ఇంజనీర్లు, నిపుణులు, అధికారులు పాల్గొని రహదారుల నాణ్యత, భద్రత, నూతన టెక్నాలజీలపై విస్తృతంగా చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here