సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

KCR Image On Yadadri Temple, Mango News Telugu, Objection To CM KCR Image On Yadadri Temple, Political Parties Objection To CM KCR Image On Yadadri Temple, Political Parties Objection To CM KCR’s Image On Yadadri Temple, Political Updates 2019, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. అక్కడ జరుగుతున్న పనులన్నీ ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అయితే ఒక్కసారిగా యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాజకీయ దుమారం చెలరేగింది. ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో రాతి స్తంభాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చెక్కడం వివాదాస్పదంగా మారుతుంది. ఈ స్తంభాలపై కేసీఆర్, కారు గుర్తు, కేసీఆర్ కిట్లు, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, చార్మినార్ తదితర బొమ్మలను చెక్కినట్టు సమాచారం.

అయితే రాతి స్తంభాలపై ఇలా బొమ్మలు చెక్కడాన్ని పలు రాజకీయపార్టీలు, హిందూ సంస్థలు వ్యతిరేకించి శుక్రవారం నాడు ఆందోళనకు దిగాయి. కేసీఆర్ చిత్రాలను చెక్కడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఖండించారు. సీఎం కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ పద్ధతి కేసీఆర్ ప్రచార కాంక్షను చాటుతుందని లక్ష్మణ్ విమర్శించారు. మరో వైపు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఆలయంలో రాతి స్తంభాలపై చెక్కిన బొమ్మలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు బొమ్మలను తొలగించడానికి ప్రభుత్వానికి వారం రోజుల పాటు సమయం ఇస్తున్నామని, వారం లోపు తొలగించకపోతే దేశంలో ఉన్న హిందూవాదులందరితో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

 

[subscribe]
[youtube_video videoid=otYfN3sfpBw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − five =