తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తో ఉత్తర్ ప్రదేశ్ వాణిజ్య పన్నుల అధికారులు భేటీ

Uttar Pradesh Commercial Taxes Dept Senior Officials Meet CS Somesh Kumar at Hyd Today, Uttar Pradesh Commercial Taxes Dept Senior Officials Meet Telangana CS Somesh Kumar at Hyd Today, Uttar Pradesh Commercial Taxes Dept Senior Officials Meet CS Somesh Kumar, CS Somesh Kumar, Telangana CS Somesh Kumar, Uttar Pradesh Commercial Taxes Dept Senior Officials, Commercial Taxes Dept Senior Officials, UP Commercial Taxes Dept Senior Officials, UP Commercial Tax dept team meets Telangana CS Somesh Kumar at Hyd Today, UP CTD officials hold meeting with Telangana Somesh Kumar at Hyd Today, Senior officials of Commercial Taxes Department of Uttar Pradesh, Commercial Taxes Department of Uttar Pradesh, Commercial Taxes Department of Uttar Pradesh Meet CS Somesh Kumar at Hyd Today, Uttar Pradesh, Mango News, Mango News Telugu,

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కమర్షియల్ టాక్స్ శాఖ అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఈ సందర్బంగా ఉత్తర్ ప్రదేశ్ బృందానికి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు యొక్క మార్గదర్శకత్వంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఆదాయం 2014లో సుమారు రూ.23 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరం ఇది దాదాపు మూడు రేట్లకు పెరిగి రూ.65 వేల కోట్లకు చేరుకుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు.

వ్యవస్తీకృత మార్పుల ద్వారా శాఖ పనితీరులో కూడా గణనీయమైన మార్పు వచ్చిందని సీఎస్ తెలియజేశారు. మాన్యువల్ ఆధారిత నోటీసులు, ప్రొసీడింగ్‌ల జారీలను పూర్తిగా తొలగించామని చెప్పారు. ప్రతీ స్థాయిలో భౌతిక లక్ష్యాల స్థానంలో నిర్దారిత ఆధారిత లక్ష్యాలను ఏర్పాటుచేశామని తెలిపారు. కొత్తగా అనేక సర్కిళ్లను ఏర్పాటు, తదితర చర్యల ద్వారా వాణిజ్య పన్నుల శాఖను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించామని, కొత్తగా శాఖ పరంగా పరిశోధన, విశ్లేషణల కోసం ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అమలవుతున్న ఉత్తమ విధానాలను తెలుసుకోవడం తమకు అవకాశం లభించిందని ఉత్తర్ ప్రదేశ్ అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ ఎస్.మినిస్టి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమీషనర్ నీతూ ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన అదనపు కమీషనర్లు సాయి కిషోర్, కాశి, శోభన్ బాబులతోపాటు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కమర్షియల్ టాక్స్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + two =