శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు

Voters from 29 states in Serilingampally Constituency,Voters from 29 states,states in Serilingampally Constituency,Serilingampally Constituency,Serilingampally Assembly constituency,votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS,Mango News,Mango News Telugu, Congress,Serilingampally Constituency Latest News,Serilingampally Constituency Latest Updates,Serilingampally Constituency Live News,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates
Voters from 29 states, Serilingampally Constituency,votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

భిన్న సంస్కృతులకు నిలయంగా చెప్పుకునే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని  మినీ భారత్‌ అని పిలుస్తారు. పారిస్‌ నగరాన్ని తలపించే అపార్ట్‌మెంట్‌లు , స్టార్ హోటల్స్, కేబుల్‌ బ్రిడ్జి, లింకు రోడ్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌,సెంట్రల్‌ యూనివర్సిటీ, నేషనల్‌ ఉర్థూ యూనివర్సిటీలతో రిచ్ నియోజకవర్గంగా చెబుతారు.

ఈ నియోజకవర్గంలో 852 కాలనీలు ఉండగా..100 కు పైగా స్లమ్స్‌ ఉన్నాయి. వాటిలో కూడా  కొన్ని స్లమ్స్‌ కాలనీలుగా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో..  బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ  హోరాహోరీగా జరుగుతోంది. దీంతో ప్రచారానికి కూడా కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టిన మూడు పార్టీల అభ్యర్థులు..ఇప్పుడు  ఎవరికి వారే కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఐటీ కంపెనీలకు నిలయంగా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 29 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. ఐటీ, ఐటీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు, హోటల్ రంగంలోనూ ఉద్యోగులుగా ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు.  అంతేకాదు దేశంలో  అతిపెద్ద నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి ఒకటి. ఇక్కడ మొత్తం 7,32,506 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుష ఓటర్లు 3,88,482, మహిళా ఓటర్లు 3,43,875, ఇతరులు 149 మంది ఉన్నారు. ఉత్తర భారతీయుల ఓట్లు దాదాపు లక్షన్నర ఉన్నట్లు అంచనా. సీమాంధ్రకు చెందిన దాదాపు 2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.వీరితో పాటు స్థానిక ఓటర్లు, మైనార్టీ ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు.

ఇటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీ తన సామాజిక వర్గ ఓటర్లతో పాటు, మైనార్టీ ఓటర్లపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. 2014లో తెలుగు దేశం పార్టీ  నుంచి పోటీ చేసి 80 వేల మెజారిటీతో గెలుపొందగా.. 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 42 వేల ఓట్లతో గెలిచారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌ ఏకంగా మూడు సార్లు కార్పొరేటర్‌గా పని చేశారు. దీంతో మాదాపూర్‌, హఫీజ్‌పేట్‌ డివిజన్లలో మంచి పట్టు ఉంది. ఆ రెండు డివిజన్లలోని మైనార్టీలు, తన సొంత సామాజికవర్గం ఓట్లు తనకే పడతాయన్న నమ్మకాన్ని పెంచుకున్నారు.

అలాగే భారతీయ జనతా పార్టీ  అభ్యర్థి ఎం.రవి కుమార్‌ యాదవ్‌ నార్త్‌ ఇండియన్స్‌ ఓట్లపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆయన 50 వేలకు పైగా నార్త్‌ ఇండియన్స్‌ ఓట్లను ఎన్‌రోల్‌ చేయించడంతో ఆ ఓట్లు తనకే పడతాయన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.అలాగేతన సామాజిక వర్గం ఓట్లు, తన తండ్రి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ తరపున వచ్చే ఓట్లు కూడా తనకు అదనపు బలంగా చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా కన్నడ, తమిళ ఓటర్లపైన  కూడా రవికుమార్ ఫోకస్‌ చేస్తున్నారు.

మరోవైపు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం పోటీ పడుతున్న ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు కూడా కుబేరులే. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీకి రూ.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జగదీశ్వర్‌ గౌడ్‌‌కు  రూ.113 కోట్ల ఆస్తులు అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎం.రవి కుమార్‌ యాదవ్‌‌కు రూ.151 కోట్ల ఆస్తులున్నట్లు..తమ ఎన్నికల అఫిడవిట్‌లో చూపించుకున్నారు. అంతేకాదు… ఈ నియోజకవర్గంలో  కుబేరులైన ఓటర్లూ చాలామందే ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 19 =