డెలివరీ బాయ్స్ కష్టాలు విన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Heard The Hardships of Delivery Boys,Rahul Gandhi Heard The Hardships,Hardships of Delivery Boys,telangana assembly elections, rahul gandhi, delivery boys, congress,Rahul Gandhi Interaction with Auto Drivers,Telangana Polls,Telangana Elections Latest News,Telangana Elections Latest Updates,Telangana Elections Live News,Rahul Gandhi Latest News
telangana assembly elections, rahul gandhi, delivery boys, congress

అసెంబ్లీ ఎన్నికలవేళ ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు సరికొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు రంగంలోకి దిగి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ తరుపున ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుంటే.. అటు కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి నేటితో తెర పడనుండడంతో..  నేతలు మరింత దూకుడుగా పావులు కదుపుతున్నారు. ఏ ఒక్కరినీ వదలకుండా.. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకెళ్తున్నారు.

ప్రచారం చివరి రోజున హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌, జీహెచ్ఎంసీ కార్మికులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను డెలివరీ బాయ్స్ రాహుల్ గాంధీకి వివరించారు. ప్రమాదాలు జరిగినా ఏజెన్సీలు తమను పట్టించుకోవడం లేదని రాహుల్‌కు డెలివరీ బాయ్స్ వివరించారు. కుటుంబ పోషణ కోసం తప్పక.. ఎన్నో కష్టాలు పడుతూ డెలివరీ బాయ్ జాబ్ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్ చివరి నిమిషంలో ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఆ భారాన్ని కూడా ఏజెన్సీలు తమపైనే వేస్తున్నాయని రాహుల్‌కు వివరించారు. అలాగే తమకు ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని రాహుల్ గాంధీని డెలివరీ బాయ్స్ కోరారు.

అయితే డెలివరీ బాయ్స్ సమస్యలు విన్న రాహుల్ గాంధీ.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రాజస్థాన్‌లో గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం సరికొత్త స్కీమ్‌ను అమలు చేస్తున్నామని.. తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. ఇకపోతే ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా డెలివరీ బాయ్స్‌తో సమావేశమయ్యారు. వారి సమస్యలను తెలుసుకొని.. డిసెంబర్ 3 తర్వాత అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకంటే ముందే హైదరాబాద్ మెట్రోలో కేటీఆర్ ప్రయాణించి.. ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =