కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ కంచర్ల భూపాల్ రెడ్డి

Who will win in Nalgonda constituency,Who will win in Nalgonda,Nalgonda constituency,win in Nalgonda,Mango News,Mango News Telugu,Nalgonda,Komatireddy Venkatareddy, Kancharla Bhupal Reddy,BRS, Congress, BJP, Assembly election 2023,Nalgonda Constituency Telangana,Telangana Assembly Elections 2023,Nalgonda Election 2023,Nalgonda Assembly Election results,Nalgonda constituency Latest News,Nalgonda constituency Latest Updates,Nalgonda constituency Live News
Nalgonda constituency,Komatireddy Venkatareddy, Kancharla Bhupal Reddy,BRS, Congress, BJP, Assembly election 2023,

సామాజిక వర్గం గురించో, రాజకీయ కారణాలతోనో కానీ  ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో నల్లగొండ శాసనసభ నియోజక వర్గంపైన అందరికీ ఆసక్తి పెరుగుతోంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి తనదైన రాజకీయాల ఒరవడిని ప్రతిబింబించే, నల్గొండ నియోజక వర్గంలో ఈసారి ఎన్నికల రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

నల్లగొండ స్థానం అంటేనే,  రాజకీయ, సామాజిక చైతన్య ప్రతీకగా చెప్పుకుంటారు.   శాసనసభకు ఎన్నికవటానికి  ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు  నల్గొండ నియోజక వర్గాన్నే ఎంచుకున్నారు. నల్లగొండలో 14 సార్లు ఎన్నికలు జరిగినా, వరుసగా నాలుగు సార్లు గెలిచిన నాయకుడుగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి రికార్డును ఇప్పటి వరకూ ఎవ్వరూ బ్రేక్ చేయలేదు.

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమిపాలయి, భువన గిరి నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. నల్లగొండను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వటం గత ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి విజయానికి దోహద పడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డిపై.. మరోసారి  కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీకి దిగారు. అలాగే బీజేపీ నుంచి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బరిలోకి దిగుతూ వీరిద్దరికీ గట్టి పోటీ ఇస్తున్నారు. బహుముఖ పోటీ నెలకొన్న నల్లగొండ స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పిల్లి రామరాజుయాదవ్‌తో పాటు మరో 30 మంది పైగా పోటీలో ఉండటం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.

ఆ నియోజక వర్గాన్ని తానెంతో అభివృద్ధి చేశానని చెబుతున్న బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి.. మరో అవకాశం ఇస్తే మిగిలిన పనులూ పూర్తి చేస్తానని, కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని  కోరుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. బీసీ సీఎం అన్న బీజేపీ ప్రతిపాదనతో ఆ పార్టీ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యంపై ప్రచారం సాగిస్తున్నారు.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ..అప్పట్లో  తన హయాంలో జరిగిన యూనివర్సిటీ ఏర్పాటు , పోలీస్ బెటాలియన్ ఏర్పాటు, ఎస్‌ఎల్బీసీ సొరంగం నిర్మాణం వంటి పనులతో పాటూ, పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఓటర్లు వీరిలో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 14 =