డోర్నకల్,ఇల్లెందు నియోజకవర్గాలలో తండాల కథ

Two MLAs for 213 people,Two MLAs,MLAs for 213 people,213 people, Thanda, Dornakal constituencies , Illendu constituencies,Haripriya , Redyanayak,BRS, Congress, BJP, Assembly election 2023,Mango News,Mango News Telugu,Dornakal constituencies Latest News,Dornakal constituencies Latest Updates,Dornakal constituencies Live News,Congress Latest News,Congress Latest Updates
2 MLAs for 213 people, Thanda, Dornakalconstituencies , Illendu constituencies,Haripriya , Redyanayak,BRS, Congress, BJP, Assembly election 2023,

ఎన్నికలలో ఎన్ని వింతలు చూసినా.. ఇంకా ఎక్కడో  కొత్త విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోనూ  ప్రత్యేక జిల్లాలు నియోజకవర్గాలు వంటివి వెలుగులోకి వస్తున్నాయి. వాటి ప్రత్యేకతలతో ఇలాంటి నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు ఉన్నాయా అని చర్చకు దారి తీస్తుంటాయి.

డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధిలో.. 71 ఇండ్లు, 213 మంది ఓటర్లు కలిగిన ఓ చిన్న తండాకు ఏకంగా ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండటం అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది.  ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండటంతో డోర్నకల్  మున్సిపాలిటీ పరిధి  మరోసారి వార్తల్లో నిలిచింది.

డోర్నకల్  మున్సిపాలిటీ  ఐదవ వార్డు పరిధిలో ఉన్న లచ్చాతండా మధ్యలో సీసీ రోడ్డు ఉంటుంది. తండాలోకి వెళ్తుండగా కుడివైపు డోర్నకల్‌ మున్సిపాలిటీ 5వ వార్డు పరిధిలో కేవలం 40 ఇండ్లు ఉండగా,అక్కడ  140 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా డోర్నకల్‌ నియోజకవర్గ పరిధిలోకి వస్తారు.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, బర్లగూడెం పరిధిలోని 10వ వార్డులో  రోడ్డుకు ఎడమ వైపున  లచ్చాతండా ఉండగా ఇక్కడ 31 ఇండ్లు, 73 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి ఓటర్లంతా ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో ఉన్నారు.

తండాలో ఒకే కుటుంబానికి చెందిన వారు విడిపోయి రోడ్డుకు రెండు పక్కల తమ నివాసాలు నిర్మించుకోవడంతో.. తండ్రి కుటుంబం ఒక నియోజకవర్గంలో, కొడుకు కుటుంబం మరో నియోజకవర్గంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఈ తండాకు డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి డీఎస్‌ రెడ్యానాయక్, ఇల్లెందు నుంచి హరిప్రియ ప్రాతినిథ్యం వహించారు.

అలాగే డోర్నకల్‌ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఎర్రమట్టి తండా, గార్ల మండలంలోని రాజుతండా గ్రామ పంచాయతీలు కలిసి ఉన్నాయి. రోడ్డుకు ఒక వైపు ఎర్రమట్టితండా, మరో వైపు రాజుతండా ఉండగా..ఈ రెండు తండాలను విడదీస్తూ మధ్యలో రోడ్డు ఉంటుంది. అయితే ఈ రెండు తండాలు కలిసి ఉన్నా.. డోర్నకల్, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ఇవి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seven =