పాలేరులో వైఎస్ఆర్‌టీపీ కార్యాలయానికి భూమి పూజ చేసిన పార్టీ అధినేత్రి షర్మిల, హాజరైన తల్లి వైఎస్ విజయమ్మ

YS Sharmila Performs Bhoomi Puja For YSRTP Office at Paleru Mother Vijayamma Attends To The Event,YS Sharmila,Sharmila Performs Bhoomi Puja,YSRTP Office at Paleru,Mother Vijayamma Attends Event,Mango News,Mango News Telugu,YS Sharmila warangal Padayatra,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana Minister KTR

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో వైఎస్ఆర్‌టీపీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించారు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల. వచ్చే ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి అనంతరం అధికార పార్టీలో చేరిన కందాళ ఉపేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో పాలేరులోని కరుణగిరి చర్చికి సమీపంలో పార్టీ నూతన కార్యాలయాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా హాజరయ్యారు.

పూజా కార్యక్రమాల అనంతరం వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయాలనే గొప్ప సంకల్పంతో షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందని, తన బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. షర్మిల తెలంగాణ బిడ్డ కాదని విమర్శలకు ఈరోజు వేసిన పునాది రాయే సమాధానమని తెలిపారు. రాజన్నకు పులివెందుల ఎలాగో.. ఇకనుంచి షర్మిలకు పాలేరు అలాగా అని చెప్పారు. తన భర్త, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన గురించి ఇప్పటికీ తెలంగాణలో ప్రజలు గుర్తుచేసుకుంటారని, ఆయన ఆశయాలను షర్మిల కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్ షర్మిల ఇదివరకే ప్రకటించిన విషయాన్ని వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =