రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ, కీలక అంశాలపై సమీక్ష

PM Modi Speaks on Telephone with Russia President Vladimir Putin Today Reviewed Several Aspects,Prime Minister Modi,Russian President Vladimir Putin,Modi Called Vladimir Putin Phone,Modi Reviewed Key Issues,Mango News,Mango News Telugu,Vladimir Putin Latest News And Updates,Narendra Modi News And Live Updates,Russia Prime Minister,Vladimir Putin Age,Russian President Vladimir Putin Speech,Russian President Vladimir Putin News,Russian President Vladimir Putin Latest News

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ శుక్రవారం ర‌ష్య‌న్ ఫెడ‌రేషన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సమర్‌కండ్‌లో ఎస్సీఓ సమ్మిట్ లో వారివురి సమావేశం తరువాత, తాజా ఫోన్ కాల్ సందర్భంగా ఇంధన సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహకారం మరియు ఇతర కీలక రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాల యొక్క అనేక అంశాలపై ఇద్దరు నాయకులు సమీక్షించారని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో, చర్చలు మరియు దౌత్యమే ఏకైకమార్గం అని ప్రధాని మోదీ తన పిలుపుని పునరుద్ఘాటించినట్టు పేర్కొన్నారు.

అదేవిధంగా కొనసాగుతున్న భారతదేశ జీ-20 అధ్యక్షత వివరాలను మరియు జీ-20 ప్రధాన ప్రాధాన్యతలను హైలైట్ చేస్తూ అధ్యక్షుడు పుతిన్‌ కు ప్రధాని మోదీ వివరించారని, మరోవైపు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌కు భారతదేశం అధ్యక్షత వహించిన సమయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నట్టుగా ప్రధాని తెలిపారు. ఇక ఇరుదేశాలకు సంబంధించి పలు అంశాలపై నిత్యం టచ్‌లో ఉండేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారని ప్రకటనలో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + eleven =