డిసెంబర్ 4వ తేదీ నుంచి 14వరకు పాదయాత్ర – వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

YSRTP Chief YS Sharmila Announces Praja Prasthanam Padayatra Again Starts on DEC 4th and Continues till 14th,Praja Prasthanam Padayatra,YSR Telangana Party,YSRTP President YS Sharmila,Sharmila To Meet Telangana DGP,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP,TRS Party, BRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,YSRTP Chief YS Sharmila,YSRTP Chief YS Sharmila Latest News and Updates

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిసెంబర్ 4, ఆదివారం నుంచి తన ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల తర్వాత పాదయాత్ర ప్రారంభం సహా పలు కీలక అంశాలపై శుక్రవారం ఉదయం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో లోటస్ పాండ్ లో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 4 నుంచి పాదయాత్ర ప్రారంభించి, 14వ తేదీ వరకు పాదయాత్రను కొనసాగించనున్నట్టు ఆమె తెలిపారు. దాడులు చేసినా, కొట్టినా, చంపినా బెదిరేది లేదన్నారు. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

సమావేశం అనంతరం పార్టీ నాయకులతో కలిసి వైఎస్ షర్మిల అదనపు డీజీ జితేందర్ ను కలిశారు. ఈ సందర్భంగా పాదయాత్రకు సంబంధించిన వివరాలను అదనపు డీజీకి వివరించి, పాదయాత్ర సమయంలో భద్రత కల్పించాలని వైఎస్ షర్మిల కోరినట్టు తెలుస్తుంది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆగిన చోట నుంచే మళ్ళీ తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నట్టు తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆపడం ఎవరి తరం కాదని వ్యాఖ్యానించారు.

మరోవైపు వైఎస్‌ షర్మిల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ని కూడా కలిసిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆమె గవర్నర్ కి ఇటీవల జరిగిన పరిణామాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల వరంగల్ లో తన పాదయాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని, ఈ విషయం గురించి గవర్నర్ ను కలిసి మాట్లాడానని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here