రేపు రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు, ముఖ్య అతిధిగా హాజరుకానున్న సీఎం కేసీఆర్

CM KCR to Attend Ugadi Celebrations to be held at Ravindra Bharathi on 22nd,CM KCR to Attend Ugadi Celebrations,CM KCR at Ravindra Bharathi on 22nd,Ugadi Celebrations to be held at Ravindra Bharathi,Mango News,Mango News Telugu,State Ugadi celebrations at Ravindra Bharathi,Telangana Ugadi Celebrations,Ugadi celebrations return to Ravindra Bharathi,CM KCR News And Live Updates,Telangana Latest News And Updates,Hyderabad News,Telangana News,Ugadi Official Celebrations

రేపు (మార్చి 22, బుధవారం) రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)” వేడుకల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. రవీంద్ర భారతిలో జరిగే శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ-దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక ప్రకటన చేశాయి. బుధవారం ఉదయం 10.30 ప్రారంభమయ్యే ఈ ఉగాది వేడుకలు నాదస్వరంతో ప్రారంభమై, ముఖ్య అతిథికి పూర్ణకుంభ స్వాగతం ఉంటుందని తెలిపారు.

అలాగే ఈ వేడుకల్లో భాగంగా ప్రార్థనాగీతం, వేదాశీర్వచనం, పంచాంగ పఠనం, వేద పండితులకు, అర్చకులకు, ఆధ్యాత్మిక వేత్తలకు సత్కారం ఉంటుందని చెప్పారు. ఇక మధ్యాహ్నం 12.30 గంటలకు కాకతీయ కాలంనాటి పద్య కవితాగోష్ఠి-సాహిత్య రూపకం (భువన విజయం మాదిరిగా), సాయంత్రం 4 గంటల నుండి కవి సమ్మేళనం ఉంటుందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =