బన్సీలాల్ పేటలో పునరుద్ధరించిన మెట్లబావి ఈ నెల 5న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

Minister Talasani Srinivas Inspects Step Well Works at Bansilalpet and Says Minister KTR will Inaugurate on DEC 5th.Golconda Stepwell,Domakonda Fort,UNESCO Awards,Minister KTR Congratulated,Mango News,Mango News Telugu,UNESCO Awards For Golkonda Stepwell,UNESCO Awards For Domakonda Fort,UNESCO Latest News And Updates,Golconda Stepwell Route Map,Golconda Fort News and Updates,Domakonda Fort News And Live Updates,Minister Talasani Srinivas

బన్సీలాల్ పేట లో పునరుద్ధరించి, ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన మెట్ల బావిని డిసెంబర్ 5వ తేదీన రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ బన్సీలాల్ పేటలోని మెట్ల బావి, పరిసరాలలో మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో కలిసి పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. మెట్ల బావి, నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్ల బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్ ను పరిశీలించారు. ప్రారంభోత్సవం రోజు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, పురాతన కట్టడాలను పరిరక్షించి, భవిష్యత్ తరాలకు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అందులో భాగంగానే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో హెఛ్ఎండీఏ ఆధ్వర్యంలో బన్సీలాల్ పేట మెట్ల బావి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ బావిని నిజాం కాలంలో అప్పటి స్థానిక ప్రజల త్రాగునీటి అవసరాల కోసం నిర్మించినట్లు చెప్పారు. అప్పట్లో ఈ బావిని నాగన్న కుంటగా పిలిచే వారని, ఇక్కడ ఉన్న ఆధారాల ద్వారా తెలుస్తుందని వివరించారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి ముందు ఈ బావి పూర్తిగా చెత్త చెదారాలతో నిండిపోయిందని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పూడిక తొలగింపు చేయగా 500 టన్నులకు పైగా ఉన్నదని, దీనిని తరలించడానికి 6 నెలల సమయం పట్టిందని చెప్పారు. పూడిక తొలగించిన తర్వాత నీటితో కలకళలాడుతుందని చెప్పారు.

బావి మరమ్మతులు, పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో మళ్ళి పూర్వ వైభవం వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో బావి పరిసరాలలో అనేక అభివృద్ధి, నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. నగరంలో 44 బావులు ఉండగా 6 బావుల అభివృద్ధి, పరిరక్షణ పనులు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. వాటిలో ముందుగా పనులు పూర్తి చేసుకొని బన్సీలాల్ పేట మెట్ల బావి ప్రారంభానికి సిద్ధమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సాహె స్వచ్ఛంద సంస్థ నిర్వహకురాలు కల్పన, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, తదితరులు ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here