ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు గుండెపోటు.. కామెంటరీ చెప్తూ కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలింపు

Former Australia Cricket Captain Ricky Ponting Taken To Hospital After Heart Scare During Perth Test Commentary,Former Australia Cricket Captain Ricky Ponting,Australia Cricket Captain Ricky Ponting,Australia Player Ricky Ponting,Ricky Ponting Latest News and Updates,Mango News,Mango News Telugu,Ricky Ponting Heart Scare,Ricky Ponting Heart Score,Ricky Ponting Perth Test Commentary,Perth Test,Ricky Ponting Commentary,

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పెర్త్‌ వేదికగా వెస్టిండీస్‌తో మొదటి టెస్టు మ్యాచ్ జరుగుతుండగా అస్వస్థతకు లోనవడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ మ్యాచ్ కు పాంటింగ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. పాంటింగ్‌ స్టేడియంలో సెవెన్ నెట్‌వర్క్ కామెంటరీ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సుమారు 40 నిమిషాల పాటు కామెంటరీ చెప్పిన అనంతరం 47 ఏళ్ల పాంటింగ్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో అతడిని సన్నిహిత మిత్రుడు మరియు ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కారులో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పెర్త్ మైదానం సిబ్బంది తెలిపారు. రికీ పాంటింగ్ అస్వస్థతతో ఉన్నాడు, అతను ఆసుపత్రిలో చేర్చబడ్డాడు అని బ్రాడ్‌కాస్టర్ ఛానల్ 7 ప్రతినిధి ఆస్ట్రేలియన్ మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా పాంటింగ్ తన కెరీర్‌లో మొత్తం 168 టెస్టులు మరియు 375 వన్డేలు ఆడాడు. 1999 నుండి 2007 వరకు ఆసీస్ యొక్క మూడు వరుస ప్రపంచ కప్ విజయాలలో పాంటింగ్‌ కీలక పాత్ర పోషించాడు. అలాగే తన సారధ్యంలో ఆస్ట్రేలియాకు 2 ప్రపంచ కప్ లు అందించాడు. అలాగే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఎక్కువ మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇక 2020లో డీన్ జోన్స్ మృతి, అటుపిమ్మట షేన్ వార్న్ మరణం అనంతరం ర్యాన్ కాంప్‌బెల్‌కు గుండెపోటు, వీటి క్రమంలో తాజాగా గుండెపోటుతో పాంటింగ్‌ ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో మాజీ క్రికెటర్ల ఆరోగ్య సమస్యల గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =