ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత నిరాహారదీక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల

YSRCP Chief YS Sharmila Interesting Comments On Brs MLC Kavitha'S Hunger Strike In Delhi,YSRCP Chief YS Sharmila,YS Sharmila Interesting Comments,YS Sharmila Comments On Brs MLC Kavitha,Brs MLC Kavitha'S Hunger Strike In Delhi,Mango News,Mango News Telugu,YS Sharmila Criticizes Brs MLC Kavitha,YS Sharmila On MLC Kavitha Strike,YSRCP Chief YS Sharmila Strong Comments,Brs MLC Kavitha To Sit On Hunger Strike,Kalavakuntla Kavitha News,Telangana Latest News And Updates,Delhi News Live

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 10న నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దీనిపై స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవితపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా షర్మిల.. ‘లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డూరం. బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు, మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదు? 2014 ఎన్నికల్లో మహిళలకు ఇచ్చింది 6 సీట్లు అంటే 5.88%.. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం? 2018లో మహిళలకు 4 సీట్లు అంటే 3.36% ఇదేనా మహిళలకు మీరిచ్చే మర్యాదా?’ అని ప్రశ్నించారు.

ఇంకా షర్మిల ఇలా అన్నారు.. ‘శాసనమండలిలో 34 సీట్లకు మహిళలకు మూడు సీట్లు.. అంటే 8.82%. ఇదేనా మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధి? 17 పార్లమెంట్ స్థానాలకు మహిళలకు రెండు సీట్లు.. అంటే 11.76%.. ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ? తెలంగాణ తొలి క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదు.. ఇప్పుడున్న క్యాబినెట్ లో పట్టుమని ఇద్దరు మంత్రులు. ఇదేనా మహిళలపై మీకున్న మక్కువ? మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో మీ తండ్రి గారికి వచ్చిన అడ్డంకి ఏంటి? మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు’ అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + eight =