అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 27, బుధవారం నాటికే అమెరికాలో కరోనా వైరస్ వలన మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. ఇప్పటిదాకా మరణించిన వారి మొత్తం సంఖ్య 1,02,107 కి చేరుకుంది. మరోవైపు అక్కడ కరోనా బాధితుల సంఖ్య 17,45,803 చేరగా, అందులో 11 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అమెరికాలో వైరస్ వ్యాప్తి ఎక్కువుగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలోనే అత్యధికంగా 23,282 మంది మరణించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి 58,03,647 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 3,57,712 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu